Sreeja : నీ వ‌ల్లే నేను హ్యాపీగా ఉన్నాన‌న్న శ్రీ‌జ‌.. పోస్టు వైర‌ల్‌..!

March 31, 2022 9:13 PM

Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా గ‌డుపుతోంది. ఇప్ప‌టికే ప‌లు ఎమోష‌న‌ల్ పోస్టుల‌ను షేర్ చేసిన శ్రీ‌జ ప్ర‌స్తుతం ఎంతో బాధలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న భ‌ర్త క‌ల్యాణ్‌దేవ్‌కు, త‌న‌కు విడాకులు అవ‌బోతున్నాయంటూ.. ఈ మ‌ధ్య కాలంలో వార్త‌లు బాగా వ‌చ్చాయి. అందుకు బ‌లం చేకూరేలా శ్రీ‌జ త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో త‌న భ‌ర్త పేరును తీసేసి త‌న పుట్టింటి పేరును పెట్టుకుంది. దీంతో వారు విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు ఒక్క‌సారిగా గుప్పుమ‌న్నాయి.

Sreeja  latest post on her daughter viral
Sreeja

ఇక అప్ప‌టి నుంచి శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్‌లు క‌ల‌సి క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టుల్లోనూ ఇద్ద‌రూ క‌ల‌సి క‌నిపించ‌డం లేదు. దీంతో వీరు ఇప్ప‌టికే విడిగా ఉంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు క‌ల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ వేడుక‌ల్లో ఈ మ‌ధ్య క‌నిపించ‌డం లేదు. దీంతోపాటు ఆయ‌న సినిమాలకు కూడా మెగా ఫ్యామిలీ ప్ర‌చారం చేయ‌డం లేదు. దీంతో శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్ ల మ‌ధ్య విడాకులు దాదాపుగా ఖాయ‌మైనట్లే.. అని తెలుస్తోంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

ఇక తాజాగా శ్రీ‌జ త‌న కుమార్తె న‌విష్క ఫొటోను షేర్ చేసింది. అందులో న‌విష్క ఓ పువ్వును ఇస్తోంది. దాన్ని అందుకున్న శ్రీ‌జ భావోద్వేగానికి గురైంది. ఇవ్వాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీ వ‌ల్లే ఈ రోజు అంతా హ్యాపీగా మారింది.. అంటూ శ్రీ‌జ త‌న కుమార్తె గురించి పోస్టు పెట్టింది. దీంతో ఆమె పెట్టిన పోస్టు వైర‌ల్‌గా మారింది. ఇక ఇటీవ‌లే హోలీ వేడుక‌ల‌ను కూడా క‌ల్యాణ్ దేవ్ ఒంట‌రిగానే జ‌రుపుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే శ్రీ‌జ పెడుతున్న పోస్టుల‌ను చూస్తుంటే ఆమె మ‌న‌స్థాపం చెంది విచారంలో ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now