Sr NTR : ఎన్‌టీఆర్ ఎలాంటి ఆహారాల‌ను తినేవారో తెలిస్తే.. షాక‌వుతారు..!

Sr NTR : ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాకండా రాజ‌కీయ రంగంలో కూడా తిరుగులేని వ్యక్తిగా, మహా నాయకుడిగా ఎదిగారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన న‌టుడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే స్వభావం కలవారిగా అందరిలో ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రాముడు, కృష్ణుడు వంటి పాత్ర‌ల‌తో తెలుగు ప్రజలను ఆక‌ట్టుకున్నారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్త‌ల్లో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ వెండితెర దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు.

రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో ప‌నిచేశారు ఎన్టీఆర్. అంత‌టి బిజీ షెడ్యూల్‌లో ఉన్నా కూడా ఎన్టీఆర్ ఆహార‌శైలి ప్రత్యేకంగా ఉండేదట. ఎన్టీఆర్ ఆహారం తీసుకునే విషయంపై ఇప్ప‌టికీ అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఎన్టీఆర్ ప్రతి రోజూ ఉదయం మూడు గంటలకే నిద్రలేచి వ్యాయామం చేసి స్నానం చేసిన తరువాత అరచేతి మందంలో ఉండే 24 ఇడ్లీలు తినేవారట. ఇలా కొంత కాలం ఇడ్లీలు తిన్న ఎన్టీఆర్ ఆ తర్వాత
ప్రతిరోజూ ఉదయం భోజనం చేసేవార‌ట.

Sr NTR

భోజనంలో క‌చ్చితంగా నాటుకోడి కూర ఉండేలా చూసుకునేవారు. ఇక చెన్నైలో ఎప్పుడైనా బజ్జీలు తినాలి అనుకున్నప్పుడు 30 లేదా 40 బజ్జీలను సునాయాసంగా తినేవారట. ఇక వేసవి  వస్తే.. ఆయన ఆహారపు అలవాట్లలో కొన్ని కొత్త మార్పులు  చేసేవారట.. ముఖ్యంగా ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా ఎన్టీఆర్ తీసుకునే వారట. మధ్యాహ్నం భోజనం తర్వాత ఆపిల్ జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకొని తాగేవారట.

అయితే ఎన్టీఆర్ కొత్త ప్రాంతానికి వెళ్లిన్నప్పుడు అక్కడి రుచులను కూడా ఆస్వాదించేవారట. ముఖ్యంగా రాజకీయల్లోకి వచ్చిన తరువాత చైతన్య యాత్రంలో ఆయన ప్రజలతో మమేకం అయ్యి ఎక్కడ టైమ్ దొరికితే.. అక్కడ ఏదుంటే అది తినేవారట. సౌకర్యాలు లేని ఆ టైమ్ లో సాధారణ జీవితం గడిపిన‌ ఎన్టీఆర్ ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలిచారు. ఇలా ఆయన ఫుడ్ విషయంలో కూడా ప్రత్యేకతల‌ను కలిగి ఉండేవారు అని ఆయనకు తెలిసిన వాళ్ళు చెబుతుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM