Spider Man No Way Home : విజువ‌ల్ వండ‌ర్‌లా ‘స్పైడర్‌ మ్యాన్‌ – నో వే హోమ్‌’ ట్రైల‌ర్.. అదరగొట్టేశారు..!

November 17, 2021 5:54 PM

Spider Man No Way Home : స్పైడర్ మ్యాన్‌ సినిమాలకు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అబ్బుర‌ప‌రిచే స‌న్నివేశాలు ప్రేక్ష‌కులకి థ్రిల్ క‌లిగించాయి. ప్రపంచాన్ని రక్షించడం కోసం దుష్ట శక్తులతో స్పైడర్‌మ్యాన్‌ చేసే విన్యాసాలు, సాహసాలు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదాన్ని అందిస్తూ అలరిస్తూ వస్తున్నాయి.

Spider Man No Way Home trailer is fantastic it is a visual wonder

తాజాగా జాన్‌ వాట్స్‌ దర్శకత్వంలో ‘స్పైడర్‌మ్యాన్‌ – నో వే హోమ్‌’ అనే చిత్రం రూపొందింది. టామ్ హొలాండ్‌, జెండియా కీలకపాత్రలు పోషించ‌గా, ఈ సినిమా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి మ‌రి కొద్ది రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ క్ర‌మంలోనే చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌లో .. ‘‘ఆ స్పైడర్‌ నన్ను కుట్టినదగ్గర నుంచి వారం రోజులపాటు నా జీవితం ఎప్పటిలానే సాధారణంగా ఉంది. ఆతర్వాతే నువ్వు దాన్ని కనిపెట్టావు’’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఓ విజువల్‌ వండర్‌లా సాగింది.

యాక్షన్‌ సన్నివేశాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ అబ్బురపరిచేలా ఉన్నాయి. ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌కి థ్రిల్‌గానే ఉంది. చిత్రం త‌ప్ప‌క వినోదాన్ని అందిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇక ఈ మూవీలో డాక్టర్‌ స్ట్రేంజ్‌ పాత్ర కూడా ఉందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ క్రమంలో మూవీ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా మరోమారు స్పైడర్‌ మ్యాన్‌ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాడని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment