Sonu Sood : కరోనా మొదటి వేవ్ సమయం నుంచి నటుడు సోనూసూద్ ఎంత మంది ఆదుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఆదుకోండి.. అంటూ తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయన నేనున్నానంటూ సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోనూసూద్ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సొంత ఊళ్లో బాలికలు, మహిళలు, యువతులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
పంజాబ్‌లోని మోగాలో ఉన్న దౌలత్‌పురా నీవన్ అనే గ్రామంలో సోనూసూద్ సోదరి మాళవిక విద్యార్థినులు, ఆశ వర్కర్లకు 1000 సైకిళ్లను పంపిణీ చేశారు. ఆమె ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో చేరేది వెల్లడించలేదు. అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలను మాత్రం చేపడుతున్నారు. ఇక ఆమెకు మద్దతుగా సోనూసూద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోనూసూద్ తన సోదరి మాళవికతో కలిసి ఇప్పటికే సూద్ చారిటీ ఫౌండేషన్ సేరిట స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మోగే ది ఢీ పేరిట విద్యార్థినిలు, ఆశ వర్కర్లకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.
అయితే పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం వేడెక్కింది. ఇప్పటికే అనేక పార్టీలు తాము ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాయో చెప్పేశాయి. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తాము అధికారంలోకి వస్తే ఒక్కో మహిళకు నెలకు రూ.2000 ఇస్తామని చెప్పగా.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ఒక్కొక్కరికి రూ.1000 ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు మహిళలకు నెల నెలా ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను, ఒక్కొక్కరికి రూ.2000తోపాటు గృహిణులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను, 5 నుంచి 12 తరగతులు చదువుతున్న బాలికలకు నెలకు రూ.5వేల నుంచి రూ.20వేలు ఇస్తామని చెప్పారు. అలాగే ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినిలకు ఉచితంగా లోన్లు కూడా ఇస్తామని తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…