Nagarjuna : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ కావడంతో ఈ విషయంలో హీట్ మరింత పెరిగింది. దీంతో ఆయనకు, ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. అయితే ఎట్టకేలకు వర్మ ఈ తగవుకు ఇక ఫుల్ స్టాప్ పెడుతున్నానని.. ఇలా మాటల యుద్ధం కొనసాగిస్తే ఒరిగేది ఏమీ ఉండదని.. కనుక ఇకపై తాను ఈ గొడవపై మాట్లాడబోనని తెలిపారు.
అయితే తాజాగా బంగార్రాజు మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అక్కినేని నాగార్జునకు ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై స్పందించాలని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆయన స్పందించారు. టిక్కెట్ల రేట్లు ఎలా ఉన్నా తన సినిమాకు వచ్చే నష్టం ఏమీ ఉండదని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశంపై ఇంతకన్నా మించి మాట్లాడడం సరికాదన్నారు.
కాగా సినిమా టిక్కెట్ల రేట్లపై ఫిబ్రవరి 10 లోపు సంపూర్ణ నివేదిక ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్ర వివరాలను సేకరిస్తోంది. పూర్తి నివేదికను త్వరలోనే కోర్టుకు సమర్పించనుంది. ఈ క్రమంలో కోర్టు తుది తీర్పు ఏమని ఇస్తుందా..? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…