Sonal Chauhan : నాకేం తెలియదు బాబోయ్‌.. వదిలేయండి.. అంటున్న సోనాల్‌ చౌహాన్‌..!

March 12, 2022 4:35 PM

Sonal Chauhan : అక్కినేని నాగార్జున ఈ ఏడాది కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు చిత్రం ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తదుపరి చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున “ది ఘోస్ట్” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ తెలియజేయడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sonal Chauhan says she does not know how she got chance in ghost movie
Sonal Chauhan

ఇక ఈ సినిమాలో నాగార్జున ఘోస్ట్ పాత్రలోనే కాకుండా గ్లామర్ పాత్రలో కూడా నటిస్తున్నట్లు తాజా ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ హీరోయిన్ తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది.

వైట్ షార్ట్ డ్రెస్‌లో బోట్‌పై  నాగ్ తో రొమాంటిక్ మూడ్‌లో క‌నిపిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన ముందుగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. అయితే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఈమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కాజల్ స్థానంలోకి అమలాపాల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక మొత్తానికి నాగార్జున సరసన నటించే అవకాశాన్ని సోనాల్ దక్కించుకుంది. అయితే వారి స్థానంలో ఈమె నటించడానికి గల కారణం మాత్రం తనకు తెలియదని, ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో సైలెంట్ గా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయానికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం తెలియదని, తనను వదిలేయాలని.. సోనాల్‌ చౌహాన్‌ విజ్ఞప్తి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment