Sitara : మ‌హేష్ బాబు కుమార్తె సితార మాట్లాడ‌డం ఎప్పుడైనా చూశారా.. వీడియో..!

June 9, 2022 10:34 PM

Sitara : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కుమార్తె సితార గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ప‌లు క‌ళ‌లలో ప్రావీణ్య‌త‌ను సంపాదించి తండ్రికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంటోంది. ఈ మ‌ధ్యే గుర్ర‌పు స్వారీ చేసిన సితార ఆ వీడియోను షేర్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక డ్యాన్స్‌లో స‌రేస‌రి. మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమాలో పెన్నీ అనే సాంగ్‌లో ఈమె డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. అలాగే క‌ళావ‌తి పాట‌కు కూడా సితార స్టెప్పులేసింది. ఇక శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా సంప్ర‌దాయ వ‌స్త్రాల‌ను ధ‌రించి కూచిపూడి నృత్యం చేసి అల‌రించింది.

ఇలా మ‌హేష్ కుమార్తె ప‌లు భిన్న‌మైన క‌ళ‌ల్లో నైపుణ్య‌త‌ను సాధించింది. తాత కృష్ణ‌, తండ్రి మ‌హేష్‌లాగే సితార గుర్ర‌పు స్వారీ నేర్చుకుంటోంది. అయితే భ‌విష్య‌త్తులో ఈమె హీరోయిన్‌గా రాణిస్తుందా.. అందుక‌నే ఈమె యాక్టింగ్‌, డ్యాన్స్, గుర్రపు స్వారీ వంటి క‌ళ‌ల‌ను నేర్చుకుంటుందా.. అని ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అయితే ఈమె పెన్నీ సాంగ్ ద్వారా ఇప్ప‌టికే తెరంగేట్రం చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ పూర్తి స్థాయిలో ఒక చిత్రంలో న‌టించేందుకు కాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Sitara told about her dance performance
Sitara

ఇక సితార ఈమ‌ధ్యే ఓ పాపుల‌ర్ టీవీ చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ కూడా ఇచ్చింది. అందులో ఆమె గ‌తంలో తాను చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను పంచుకుంది. త‌న డ్యాన్స్‌ను తాత కృష్ణ‌, సోద‌రుడు గౌత‌మ్ కృష్ణ చూశారా.. చూస్తే ఎలా ఉంద‌ని చెప్పారు.. వంటి ప్ర‌శ్న‌ల‌ను యాంక‌ర్ అడిగింది. దీంతో సితార త‌న తాత త‌న డ్యాన్స్‌ను చూసి మెచ్చుకున్నార‌ని చెప్పింది. అయితే సోద‌రుడు మాత్రం మొద‌ట ఏమీ చెప్ప‌లేద‌ని.. త‌రువాత బాగానే ఉంద‌ని అన్నాడ‌ని.. తెలియ‌జేసింది. కాగా సితారకు చెందిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment