రైలు పట్టాలపై టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి మృతదేహం.. మాయమైన కుటుంబ సభ్యులు..

November 25, 2021 6:44 PM

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ హరిణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరు రైలు పట్టాలపై కనిపించడంతో అతని మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకే రావు సుజన్‌ ఫౌండేషన్‌లో సీఈవోగా ఉన్నారు. వీరి కుటుంబం హైదరాబాద్‌లో నివసించే వారు.

singer harini father death mystery family members disappeared

గత వారం రోజుల నుంచి వీరి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడంతో బంధువులు వీరికి ఫోన్ చేసినప్పటికీ స్విచాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో ఇది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేశారని భావిస్తున్నారు.

అయితే గత వారం రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న కుటుంబ సభ్యులు ఏమయ్యారు ? వీరందరూ ఎక్కడికి వెళ్లారు ? వీరి కుటుంబంలో ఏవైనా మనస్పర్థలు వచ్చాయంటూ.. అంటూ.. వివిధ రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా వారం రోజులపాటు కనిపించకుండాపోవడంతో ఈ కుటుంబంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో.. ఇది హత్యా లేక ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment