Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాలో నాని కంటే ముందు రానాను హీరోగా అనుకున్నారట. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ‘శ్యామ్ సింగ రాయ్’ స్క్రిప్ట్ ను ముందుగా రానా కు వినిపించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. దీంతో అది నాని చెంతకు వచ్చింది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఫస్ట్ షాట్ నుంచి ఈ టీజర్ లో కనిపించిన ప్రతి విజువల్ కూడా చాలా గ్రాండ్ గా అదిరే లెవెల్లో కనిపిస్తోంది. అలాగే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కానీ.. అందులోని నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ.. నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తున్నాయి.
‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్’’ అంటూ శ్యామ్‌సింగరాయ్ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపేలా ఉన్నాయి. టీజర్ లో సను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ.. మిక్కీ జె మేయర్ ల బ్యాక్ గ్రౌండ్‌ల స్కోర్ లకి మాత్రం.. స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…