Shyam Singha Roy : నానితో కృతి శెట్టి లిప్ టు లిప్‌.. శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్ అదిరిందిగా..

November 18, 2021 11:06 AM

Shyam Singha Roy : నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాలో నాని కంటే ముందు రానాను హీరోగా అనుకున్నారట. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ‘శ్యామ్ సింగ రాయ్’ స్క్రిప్ట్ ను ముందుగా రానా కు వినిపించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. దీంతో అది నాని చెంత‌కు వ‌చ్చింది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

Shyam Singha Roy teaser is fantastic

శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ విడుదలైంది. ఇందులో డైలాగ్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

ఫస్ట్ షాట్ నుంచి ఈ టీజర్ లో కనిపించిన ప్రతి విజువల్ కూడా చాలా గ్రాండ్ గా అదిరే లెవెల్లో కనిపిస్తోంది. అలాగే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కానీ.. అందులోని నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ.. నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తున్నాయి.

‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్‌‌’’ అంటూ శ్యామ్‌సింగరాయ్‌ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపేలా ఉన్నాయి. టీజర్ లో సను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ.. మిక్కీ జె మేయర్ ల బ్యాక్ గ్రౌండ్‌ల‌ స్కోర్ లకి మాత్రం.. స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now