Shruti Haasan : స‌లార్ మూవీలో ఆద్య‌గా శృతి హాస‌న్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

January 28, 2022 12:57 PM

Shruti Haasan : శృతి హాస‌న్ త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోల‌తో న‌టించింది. హిందీ, తెలుగు, త‌మిళం అనేక భాష‌ల్లో అగ్ర హీరోల‌తో చేసింది. కానీ తొలిసారిగా ప్ర‌భాస్‌తో న‌టిస్తోంది. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌లార్ మూవీలో శృతి.. ప్ర‌భాస్‌కు జోడీగా న‌టిస్తోంది. యాక్ష‌న్ డ్రామా జోన‌ర్‌లో ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు.

Shruti Haasan as aadya in salaar movie first look launched

కాగా శృతి హాస‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ మూవీలో శృతి ఆద్య పాత్రను పోషిస్తోంది. కాగా ఆద్య పాత్ర‌లో శృతి ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంద‌ని కితాబిస్తున్నారు.

హోమ్‌బేల్ ఫిలిమ్స్ నిర్మాణంలో స‌లార్‌ను అత్యంత భారీ సాంకేతిక విలువ‌లు, బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. కేజీఎఫ్‌కు ప‌నిచేసిన టెక్నిక‌ల్ టీమ్ ఈ మూవీకి ప‌నిచేస్తున్నారు. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా స‌లార్ ఉంటుంద‌ని తెలుస్తోంది. తెలుగుతోపాటు మొత్తం 5 భాషల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే జూలై 29వ తేదీన ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now