Shriya Saran : త‌న కూతురిని భుజాల‌పై కూర్చోపెట్టుకొని వీధుల్లో తిరుగుతున్న శ్రియ‌..!

October 15, 2021 11:48 AM

Shriya Saran : ఎవ‌రికైనా మాతృత్వం పొంద‌డంలో చాలా గొప్ప అనుభూతి ఉంటుంది. టాలీవుడ్ హీరోయిన్ శ్రియ కూడా ఇప్పుడు ఆ అనుభూతిని ఆస్వాదిస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ‌.. ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.

Shriya Saran wandering in streets with her daughter

మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని.. తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ వరకూ అందరితోనూ న‌టించిన శ్రియ‌ 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అయితే అత‌నితో నానా ర‌చ్చ చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది. తన భర్తతో వివిధ ప్రాంతాలకు షికార్లకు వెళుతూ అక్కడ హాట్ యాంగిల్స్‌లో ఫోటోలు దిగుతూ.. వాటిని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. ఇలా ఆమె షేర్ చేసిన ఫోటోలు పలు మార్లు ఆమెను విమర్శల పాలు కూడా చేశాయి.

శ్రియ రీసెంట్‌గా పండంటి కూతురికి జ‌న్మ‌నిచ్చిన‌ట్టు పేర్కొంది. 2020లో అందరూ కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కోగా.. తనకు మాత్రం దేవుడు మరిచిపోలేని ఓ బహుమతిని ఇచ్చాడని ఆమె తెలిపింది. ఓ ఏంజిల్‌ లాంటి చిన్నారి తమ జీవితంలోకి వచ్చిందంటూ ఆమె పేర్కొంది. ఆమె పేరు రాధ అని పెట్టిన‌ట్టు కూడా తెలిపింది. అయితే శ్రియ కొద్ది రోజుల క్రితం ముంబైకి రాగా, అక్క‌డ వీధుల్లో త‌న కూతురిని భుజంపై కూర్చోపెట్టుకొని పండ్లు కొంటోంది. పార్క్‌ల‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment