Shriya Saran : నా ఫ్రెండ్ చనిపోవ‌డంతో హృద‌యం బ‌ద్ధ‌లైంద‌న్న శ్రియ‌..!

December 8, 2021 8:45 PM

Shriya Saran : ఒక‌ప్పుడు స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న న‌టించి సంద‌డి చేసిన శ్రియ కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకోవ‌డం, పండంటి బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌డం కూడా జ‌రిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి సినిమాలు చేస్తున్న శ్రియ త్వ‌ర‌లో గ‌మనం చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. గమనం సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా శరన్ మీడియాతో ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చారు.

Shriya Saran told that she was heart broken when her friend died

నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఇక నుంచి నేను చాలెంజింగ్ పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్.. అని అనకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను.. అని శ్రియ పేర్కొంది.

గ‌మ‌నం సినిమా షూటింగ్ సమయంలోనే నా ఫ్రెండ్ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అయినా ఆ బాధలోనే షూటింగ్ చేశాను.. అని శ్రియ పేర్కొంది. ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగా నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. బాధ్య‌త‌లు పెరిగిపోతాయి.. అని స్ప‌ష్టం చేసింది శ్రియ‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment