Shriya Saran : త‌న కుమార్తెకు శ్రియ ఏం పేరు పెట్టిందో తెలుసా ?

October 12, 2021 10:31 PM

Shriya Saran : న‌టి శ్రియా శ‌ర‌న్ తాజాగా అంద‌రికీ స‌డెన్ గా స‌ర్‌ప్రైజ్‌ను ఇచ్చిన విష‌యం విదిత‌మే. లాక్ డౌన్ స‌మ‌యంలో తాను బిడ్డ‌ను క‌న్నాన‌ని.. త‌న కుమార్తెను శ్రియ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. దీంతో అందరూ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఓ ఇంగ్లిష్ మీడియా చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రియ త‌న కుమార్తె గురించిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

Shriya Saran named her baby do you know what it is

త‌న భ‌ర్త ఆండ్రె కొశ్చీవ్ లాక్ డౌన్ స‌మ‌యంలో బిడ్డ‌ను కందామ‌ని చెప్పాడ‌ని.. అందుక‌నే అది స‌రైన స‌మ‌యం అని భావించి తాను బిడ్డ‌ను క‌న్నాన‌ని శ్రియ తెలిపింది. అయితే త‌న కుమార్తెకు రాధ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు శ్రియ వెల్ల‌డించింది. రాధ అని పేరు పెట్ట‌డంపై త‌న భ‌ర్త కూడా ఎంతో సంతోషించాడ‌ని శ్రియ తెలిపింది.

రాధకు ప్ర‌స్తుతం 9 నెల‌ల వ‌య‌స్సు కాగా.. ఆమె ఇప్ప‌టికే అనేక దేశాలు తిరిగింద‌ని శ్రియ చెప్పుకొచ్చింది. ఇక రాధ బార్సిలోనాలో పుట్టింద‌ని, త‌న త‌ల్లి ఇండియాలో ఉంద‌ని.. అన్ని ర‌కాలుగా త‌న‌కు అండ‌గా ఉంటుంద‌ని తెలిపింది. కాగా శ్రియ త‌దుపరి సినిమాలు అయిన ట్రిపుల్ ఆర్‌, గ‌మ‌నం, ఎ మ్యూజిక‌ల్ స్కూల్‌ల‌లో క‌నిపించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment