Shivani Rajashekhar : ఆ టైమ్‌లో చాలా డిప్రెష‌న్‌ లోకి వెళ్లిన‌ట్లు చెప్పిన రాజ‌శేఖ‌ర్ కూతురు..!

November 15, 2021 7:52 PM

Shivani Rajashekhar : టాలీవుడ్ సినీ హీరోల వారసులు సినిమాల్లో రాణించడం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాసెస్ లో కొంతమంది బ్యాక్ గ్రౌండ్ తో తమ పాపులారిటీ ఎక్కడికో చేరితే.. మరికొంతమంది మాత్రం టాలెంట్ ఉన్నా.. ఎదగలేరు. అయితే ఫిల్మ్ మేకర్స్ చాలా మంది స్టార్ కిడ్స్ అయినా.. కొత్త నటీనటులైనా ఒక్కటేనని అంటుంది శివానీ రాజశేఖర్. అలా శివానీ, ఆమె చెల్లెలు శివాత్మికలు సినిమాల్లో నటించేందుకు ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని, మరెన్నో కొత్త విషయాల్ని నేర్చుకున్నామని అన్నారు.

Shivani Rajashekhar said that she has gone into depression at that time

అలాగే జీవితంలో మనం అనుకున్నది సాధించడానికి ఇంకా నేర్చుకుంటూనే ఉండాలని శివానీ రాజశేఖర్ అన్నారు. తేజా సజ్జా, శివానీ కలిసి నటిస్తున్న అద్భుతం సినిమాకు మల్లిక్ రామ్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమాను నవంబర్ 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివానీ తన సినిమా విశేషాల్ని అభిమానులతో పంచుకున్నారు. హిందీ సినిమా 2 స్టేట్స్ తెలుగు రీమేక్ తోనే తన ఎంట్రీ ఉండాల్సిందట.

ఆ తర్వాత విష్ణు విశాల్ తో కలిసి కోలీవుడ్ సినిమా స్టార్ట్ అయ్యి పలు కారణాలతో వాయిదా పడిందని అన్నారు. అలా అసలు తన సినిమాలు ఎందుకు రిలీజ్ అవ్వడం లేదని చాలా ఒత్తిడికి గురై డిప్రెషన్ లోకి వెళ్ళిందట. ఆ టైమ్ లో ఆమె తల్లిదండ్రులు చాలా సపోర్ట్ గా నిలిచారట. లేటెస్ట్ గా శివానీ యాక్ట్ చేసిన తమిళ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment