Shivani Rajashekar : సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు లేదా నటీనటుల వారసులు అరంగేట్రం చేస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎంత పెద్ద హీరో లేదా హీరోయిన్ వారసులు అయినా సరే.. సినిమా కథలో దమ్ముండాలి.. అలాగైతేనే ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు. అలా ఆదరణ దక్కించుకుంటున్న వారిలో హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ ఒకరు. ఈమె అద్భుతం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది. కాకపోతే ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు.
ఇక అందరు హీరోయిన్లలాగే శివానీ కూడా అప్పుడప్పుడు ఫొటోషూట్స్ చేస్తుంటుంది. తాజాగా ఈమె బ్లూ కలర్ డ్రెస్‌లో చేసిన ఫొటోషూట్ అలరిస్తోంది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలోనూ శివానీ ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన అభిమానులతో ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకుంటుంది.
శివానీ నటించిన అద్భుతం సినిమా కథ పరంగా బలంగా ఉన్నప్పటికీ ఓటీటీలో విడుదల అవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. థియేటర్లలో ఇలాంటి సైంటిఫిక్ సినిమాలు రిలీజ్ అయితే ఆదరణ ఎక్కువగానే వస్తుంది. కానీ ఓటీటీలో విడుదలవడం వల్ల ఈ మూవీ రిలీజ్ అయినట్లు చాలా మందికి తెలియలేదు. అద్భుతమైన టైమ్ ట్రావెల్ కథతో అద్భుతం సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రతి సీన్ ఉత్కంఠను కలిగిస్తుంది.
తండ్రి రాజశేఖర్, తల్లి జీవితలు ఎంత గొప్ప నటులుగా పేరుపొందారో అందరికీ తెలుసు. వారి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శివానీ కూడా నటనలో తల్లిదండ్రులకు దీటుగా రాణిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె చక్కని అవకాశం కోసం ప్రస్తుతం ఎదురు చూస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…