మోహ‌న్‌బాబుకే చుక్క‌లు చూపించిన హీరోయిన్‌.. చెంప పగలగొట్టిన మోహన్ బాబు..

August 19, 2022 2:28 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలామంది భయపడతారు. మోహన్ బాబు ముక్కు సూటిమనిషి. ఏ విషయాన్ని అయినా ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. మోహన్ బాబు సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే.. ఉదయం చెప్పిన టైంకు కచ్చితంగా సెట్లో ఉండాల్సిందే. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు. విష్ణు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2003లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఉన్న సాక్షి శివానంద్ సోదరి శిల్ప శివానంద్ నటించింది. ఇదే ఆమెకు తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ శిల్ప శివానంద్‌ దర్శకుడిని పదేపదే ఇబ్బంది పెడుతుండడంతో షాజీ కైలాస్ చాలాసార్లు ఓపిక పట్టి మోహన్ బాబుకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కూడా ముందు కాస్త ఓపిక పట్టిన తర్వాత శిల్ప శివానంద్ అతిగా ప్రవర్తించడంతో ఆమెపై చేయి చేసుకోవడంతోపాటు.. చెంప మీద కొట్టారన్న టాక్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

shilpa shivanand over action mohan babu slapped her

శిల్పా శివానంద్‌ ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఆమె దురుసు ప్రవర్తన వల్లే గొడవ జరిగిందని.. దర్శకుడు చెప్పినట్టు కాకుండా ఆమెకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుండడంతోనే మోహన్ బాబు వార్నింగ్‌ ఇచ్చారని ఆ సినిమా వర్గాలు చెప్పాయి.

ప్రస్తుతం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన కుమార్తె లక్ష్మీ మంచుతో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా అగ్ని నక్షత్రం. దీనికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment