Shanmukh : మై ల‌వ్ ఈజ్ గాన్ అంటూ పోస్టు పెట్టిన ష‌ణ్ముఖ్.. దీప్తిని ఉద్దేశించేనా..?

January 30, 2022 7:56 PM

Shanmukh : బిగ్ బాస్ సీజ‌న్ 5 సంద‌ర్భంగా ష‌ణ్ముఖ్‌, సిరి హౌజ్‌లో కొన‌సాగించిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అలా వ‌ద్దు, చేయ‌కూడ‌ద‌ని.. సాక్షాత్తూ హోస్ట్ నాగార్జున ఎన్నో సార్లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వారు ప‌ట్టించుకోలేదు. కిందా మీదా ప‌డ్డారు. హ‌గ్గుల‌తో రెచ్చిపోయారు. అయితే సీన్ క‌ట్ చేస్తే.. ఆ షో అయిపోయి కంటెస్టెంట్లు బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత ష‌ణ్ముఖ్ రియ‌ల్ లైఫ్ గ‌ర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైన అత‌నికి బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఈ సంఘ‌ట‌న జ‌రిగి కూడా నెల రోజులు పైనే అవుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. కానీ సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ఒక‌రిపై ఒక‌రు పోస్టులు మాత్రం పెట్టుకుంటున్నారు.

Shanmukh posted my love is gone song is this for deepthi sunaina
Deepthi Sunaina Shanmukh

బిగ్ బాస్ సీజ‌న్ 5 హౌస్ లో ష‌ణ్ముఖ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. అయితే ఆ సంతోషం అత‌నికి లేకుండా పోయింది. కార‌ణం.. షో ముగిశాక.. ష‌ణ్ముఖ్ కు దీప్తి బ్రేక‌ప్ చెప్ప‌డ‌మే. షో ముగిశాక వీరిద్ద‌రూ విడిపోతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. చివ‌ర‌కు అదే నిజం అయింది. దీప్తి బ్రేక‌ప్ చెప్పేసింది. వీరిద్ద‌రి బ్రేక‌ప్‌కు సిరినే కార‌ణ‌మ‌ని నెటిజ‌న్లు విమ‌ర్శించారు.

హౌస్ లో సిరి, ష‌ణ్ముఖ్ ఇద్ద‌రూ క్లోజ్‌గా ఉండ‌డం వ‌ల్లే హ‌ర్ట్ అయిన దీప్తి.. ఆ త‌రువాత ష‌ణ్ముఖ్‌కు బ్రేక‌ప్ చెప్పింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అయితే తాజాగా ష‌ణ్ముఖ్ పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది. అత‌ను ఆర్య 2 సినిమాలోని మై ల‌వ్ ఈజ్ గాన్ అనే పాట‌కు స్టెప్స్ వేసి ఆ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియోను అత‌ను దీప్తిని ఉద్దేశించే పోస్ట్ చేశాడ‌ని అంటున్నారు.

Shanmukh : ఇద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్.. 

ఇక దీప్తి కూడా త‌క్కువేమీ తిన‌లేదు. ఆమె కూడా ష‌ణ్ముఖ్‌కు త‌గిలేలా ఇన్‌డైరెక్ట్‌గా కోట్స్ షేర్ చేస్తోంది. నాకు మనుషుల్ని అర్ధం చేసుకునే గుణం ఉంది, అలాగని మోసాన్ని కనిపెట్టలేని అమాయకురాలిని కాదు.. అంటూ దీప్తి పోస్ట్ పెట్టింది. దీన్ని ఆమె ష‌ణ్ముఖ్‌ను ఉద్దేశించే చేసింద‌ని తెలుస్తుంది. ఇలా ఈ ఇద్ద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతుండ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. మ‌రి ముందు ముందు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment