Shah Rukh Khan : వామ్మో.. కేవ‌లం ఇంటి గేట్ ద‌గ్గ‌ర ఉండే నేమ్ ప్లేట్ కోస‌మే షారూక్ ఖాన్ అంత ఖ‌ర్చు చేశాడా..?

May 3, 2022 8:01 PM

Shah Rukh Khan : బాలీవుడ్ స్టార్ హీరోల‌లో షారూఖ్ ఖాన్ ఒక‌రు. అత‌డిని ముద్దుగా బాలీవుడ్ బాద్ షా అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ వ‌య‌స్సులోనూ షారూఖ్ ఖాన్ వ‌రుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. జీరో సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న షారూఖ్ ఖాన్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు.అయితే తాజాగా ఆయ‌న ఇంటికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ముంబైలోని బాంద్రాలో షారూఖ్ ఖాన్‌కి పెద్ద భవంతి ఉన్న విషయం తెలిసిందే. తన అభిరుచికి తగినట్లుగా ఈ ఇల్లును మలుచుకున్నాడు. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది.

Shah Rukh Khan mannat house new name plate cost
Shah Rukh Khan

ఆ ఇంటికి మ‌న్న‌త్ అనే పేరుని షారూఖ్ పెట్టుకోగా.. ఆయ‌న బ‌ర్త్ డే నాడు అభిమానులు మ‌న్న‌త్‌కి భారీగా త‌ర‌లి వ‌స్తుంటారు. ఆ స‌మ‌యంలో మ‌న్న‌త్ దీప‌పు కాంతుల‌తో మెరిసిపోతుంటుంది. అయితే మ‌న్న‌త్ నేమ్‌ ప్లేట్‌ను చాలా సార్లు మార్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్‌తో మన్నత్‌ నేమ్‌ ప్లేట్‌ను మార్చాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆ నేమ్ ప్లేట్ ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఈనేమ్ ప్లేట్‌ని షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేయ‌గా, దీనికి రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యింద‌ట‌.

యూర‌ప్ నుండి దిగుమ‌తి చేసిన ప్ర‌త్యేక రాయితో మ‌న్న‌త్ నేమ్ ప్లేట్‌ని రూపొందించిన‌ట్టు తెలుస్తోంది. కొత్త డిజైన్ దగ్గ‌ర చాలా మంది ప‌లు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఇంటిలో 2001 నుంచి షారుఖ్ ఖాన్, అతని కుటుంబం నివాసం ఉంటున్నారు. ప్ర‌స్తుతం షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమా చేస్తుండ‌గా.. ఈ మూవీ విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment