Saravanan : ఎంత బిజినెస్ మన్ అయినా.. ఎంత గొప్ప రాజకీయ వేత్త అయినా.. ఆయన వస్తున్నాడు అంటే.. బిజినెస్ మెన్ అయితే ఆ బిజినెస్ కి సంబంధించిన పది మంది.. అదే పొలిటిషియన్ అయితే ఆ పార్టీ కార్యకర్తలు.. మీటింగ్ లు గట్రా జరిగితే జనాలు.. వచ్చేస్తారు. కానీ హీరో అయితే ఆ లెక్కే వేరు.. జస్ట్ ఒకటి రెండు సినిమాలు చేసి కొద్దిపాటి ఐడెంటిటీ తెచ్చుకున్నా.. తను ఎక్కడికి వెళ్లినా సరే అక్కడ జనాలు అతనితో సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్ లు తీసుకుంటారు. బహుశా ఈ క్రేజ్ ను చూసే కాబోలు.. చెన్నైలో ఓ అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అధినేత శరవణన్ మనసులో ఓ ఆలోచన కలిగేలా చేసింది.
తానెంత పెద్ద బిజినెస్ మన్ అయినా బయట తనని ఎవరు రిజిస్టర్ చేయట్లేదని అనుకున్నాడో ఏమో సడెన్ గా అతను హీరోగా మారేందుకు రంగ సిద్ధం చేసుకున్నాడు. దర్శక ద్వయం జేడీ అండ్ జెర్రీ దర్శకత్వంలో శరవణన్ హీరోగా ది లెజెండ్ సినిమా వస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారని విజువల్స్ చూస్తేనే అర్ధమవుతోంది. అంతకుముందు శరవణన్ స్టోర్స్ యాడ్స్ లో ఆయన కనిపించే వారు. శరవణన్ స్టోర్స్ యాడ్స్ లో కేవలం ఒక్క మేల్ ఆర్టిస్ట్.. అది కూడా శరవణన్ మాత్రమే ఉండేవారు. ఈ యాడ్స్ లో మరో మేల్ ఆర్టిస్ట్ ఉంటే తనని డామినేట్ చేస్తాడని కేవలం అతను ఒక్కడు మాత్రమే చేశావాడట. పక్కన అంతా అమ్మాయిలతోనే కలర్ ఫుల్ గా యాడ్ ఉండేది.
శరవణ్ స్టోర్స్ యాడ్స్ లో స్టార్ హీరోయిన్స్ తమన్నా, హన్సికలు కూడా శరవణన్ పక్కన నటించారు. ఆ యాడ్స్ కోసం కూడా భారీగానే ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఆయన గాలి యాడ్స్ నుంచి సినిమాలకు మళ్లింది. ఎలాగూ తన స్టోరీ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది కాబట్టి సినిమాలు కూడా చేసేద్దాం అని ఫిక్స్ అయ్యారు శరవణన్. ఈ క్రమంలోనే తన మొదటి సినిమా ది లెజెండ్ ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈయన వయస్సు 52 ఏళ్లు.
ఈ సినిమా భారీ యాక్షన్ మూవీగా వస్తోంది. మరి శరవణన్ ని ఆడియెన్స్ ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి. చేసింది మొదటి సినిమానే. దాంతోనే పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ది లెజెండ్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. హీరో అవ్వాలంటే టాలెంట్ మాత్రమే కాదు.. కోట్ల కొద్దీ డబ్బున్నా అవ్వొచ్చని మరోసారి శరవణన్ ప్రూవ్ చేశారు. మరి ఈయన సినిమా ఏమవుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…