Sara Arjun : ఇంట‌ర్నెట్‌లో లేటెస్ట్ సెన్సేష‌న్ ఈ బ్యూటీ.. ఇంత‌కీ ఈమె ఎవ‌రో తెలుసా..?

October 3, 2022 7:30 AM

Sara Arjun : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన పొన్నియిన్ సెల్వ‌న్ మూవీ త‌మిళ‌నాట ఘ‌న విజ‌యం సాధించింది. కానీ తెలుగులో పెద్ద‌గా బ‌జ్ లేదు. అయితే సినిమా హిట్, ఫ్లాప్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇందులో న‌టించిన ఓ బ్యూటీ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో లేటెస్ట్ సెన్సేష‌న్‌గా మారింది. ఆమె న‌టించింది కొన్ని సెక‌న్లే అయినా అంద‌రి మ‌న‌స్సుల‌ను దోచుకుంది. ఇంత‌కీ ఈ బ్యూటీ ఎవ‌రా.. అని ఆలోచిస్తున్నారా.. ఆమె.. సారా అర్జున్‌. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ఈమె న‌టించింది. కానీ యంగ్‌గా మారిన త‌రువాత ఇప్పుడే ఫ‌స్ట్ టైమ్ ఈమెను చూస్తున్నారు.

పొన్నియిన్ సెల్వ‌న్ 1 మూవీలో నందిని పాత్ర‌లో న‌టించిన ఐశ్వ‌ర్యా రాయ్ చిన్న‌త‌నం క్యారెక్ట‌ర్‌లో సారా అర్జున్ న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఈమె యాక్టింగ్‌, అందానికి అంద‌రూ ముగ్ధుల‌వుతున్నారు. ఇక సారా అర్జున్ ప్ర‌స్తుతం వ‌య‌స్సు 17 ఏళ్లు కాగా.. ఈమె గ‌తంలో విక్ర‌మ్ నాన్న మూవీలో న‌టించింది. అలాగే ప‌లు ఇత‌ర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది.

Sara Arjun in Ponniyin Selvan 1 movie her photos viral
Sara Arjun

ఇక 2005లో జ‌న్మించిన ఈ బ్యూటీ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈమె దాగుడుమూతా దండాకోర్‌, జై హో, ఏక్ ల‌డ్‌కీ కో దేఖా తో ఐసా ల‌గా.. అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం 404 అనే బాలీవుడ్ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే పొన్నియిన్ సెల్వ‌న్ 2లో ఈమె పాత్ర నిడివి ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now