మీనాను క‌ల‌సిన స్నేహితురాళ్లు.. భ‌ర్త‌ను కోల్పోయిన దుఃఖంలో ఓదార్పు..

August 19, 2022 2:18 PM

మీనా అంటే సినిమాల్లో పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. 1990లో తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ . త‌మిళ‌నాడులో పుట్టిన‌ప్ప‌టికీ తెలుగు సినిమాల ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ, హిందీ భాష‌ల్లో న‌టించింది. ఇప్ప‌టికీ ఎన్నో మంచి చిత్రాల్లో న‌టిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉంది. సోష‌ల్ మీడియాలో కూడా త‌ర‌చూ పోస్టులు పెడుతూ యాక్టివ్ గా ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా ఈ మ‌ధ్య మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణం ఆమెని తీవ్ర మ‌న‌స్థాపానికి గురి చేసింది. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో ఆయ‌న ఇటీవ‌ల మ‌ర‌ణించారు. ఈ విష‌యంలో త‌న బంధువులు, స్నేహితులు త‌న‌కి అండ‌గా నిలిచారు. ఈ క్ర‌మంలో త‌ను సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటూ వ‌స్తోంది. భ‌ర్త చ‌నిపోయిన ద‌గ్గ‌రి నుండి ఇన్ స్టాగ్రామ్ లో కేవ‌లం 3 పోస్టులే పెట్టింది.

sanghavi and sangeetha met meena along with rambha

అయితే లేటెస్ట్ గా మీనా త‌న మిత్రురాళ్ల‌యిన నాటి త‌రం హీరోయిన్లు సంఘ‌వి, సంగీత, రంభ త‌దిత‌రుల‌తో దిగిన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. వీరంతా త‌మ త‌మ కుటుంబాల‌తో క‌లిసి వెళ్లి మీనాను ప‌రామ‌ర్శించారు. భ‌ర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆమెకు వారు ఓదార్పును ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే తీసిన ఫొటోను మీనా త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మీనా ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. భ‌ర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఇటీవ‌లే తేరుకున్న ఆమె సినిమా షూటింగ్‌ల‌లోనూ పాల్గొంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now