Samantha : బాబోయ్.. స‌మంత.. ఏంటిది.. రూ.3 కోట్ల బంగారం, 30 కిలోల చీర‌నా..!

January 30, 2023 11:33 AM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో స‌మంత ఒక‌రు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్న స‌మంత ఇటీవ‌ల అనారోగ్యం బారిన ప‌డ‌గా, ఆమె కొన్నాళ్లు సినిమా షూటింగ్‌ల‌కి దూరంగా ఉంది. స‌మంత న‌టించిన య‌శోద చిత్రం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. ఇక గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న ఈ పౌరాణిక ప్రణయగాథ ఫిబ్రవరి 17న పాన్‌ ఇండియా స్థాయిలో అల‌రించేందుకు సిద్ధ‌మైంది.

శాకుంత‌లం సినిమాకు స్టెలిష్ట్‌గా జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్లా వ్యవహరించ‌గా, సమంత ధరించిన నగలను నేహా అనుమోలు డిజైన్‌ చేశారని తెలిసింది. యువరాణి శకుంతల పాత్రలో సహజత్వం కోసం నిజమైన బంగారు ఆభరణాల్ని ఉపయోగించారట. వీటి విలువ రూ.3 కోట్లు అని స‌మాచారం.సమంత ధరించిన చీరను ఒరిజినల్‌ ముత్యాలు పొదిగి రూపొందించారు. 30 కేజీల బరువు ఉండే ఈ చీరను ధరించి సమంత ఏడు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నదని నీతా లుల్లా చెప్పుకొచ్చింది.ది. దిల్‌రాజు, నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Samantha with rs 3 crore value of gold and 30 kilos of saree
Samantha

శాకుంత‌లం సినిమాలో సమంత ప్రధాన పాత్ర అవ్వడంతో పాటు పౌరాణిక సినిమా అవ్వడం వల్ల అందరి చూపు ఈ సినిమాపై ఉంది.సినిమా పై ఎంతగా ఆసక్తి ఉన్నా.అంచనాలు ఉన్నా కూడా ప్రమోషన్‌ విషయంలో ఫిల్మ్‌ మేకర్స్ కొంత అల‌స‌త్వం చూపిస్తున్న‌ట్టు తెలుస్తుంది. రాజ‌మౌళి లాంటి వారే కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తాడు.ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్ సినిమా పై అంచనాలు పెంచుతూనే ఉంటాయి. కాని శాకుంత‌లం సినిమాకి పెద్ద‌గా ప్ర‌మోష‌న్స్ చేయ‌క‌పోవ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.ఇందులో చిన్న‌నాటి భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ న‌టించారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now