Samantha : సమంత మనస్సులో ఏముంది ? త్వరలో సంతోషాలు ఉంటాయట..!

November 6, 2021 8:48 PM

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి సమంత. తన అందం, నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మళ్లీ వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే సమంత ఓ ఉద్దేశంతో ఓ మాట చెప్పేసింది. ఇంతకు అదేంటో చూద్దాం.

Samantha told that soon there will be happiness

సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సమంత మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ ఇటీవలే నాగచైతన్యను వీడిపోయింది. మళ్లీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. కానీ ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఇక ఈ మధ్య తన సోషల్ మీడియా వేదికగా కొన్ని సూక్తులు, జీవితానికి సంబంధించిన విషయాలను తెలుపుతోంది.

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ కొటేషన్ ను షేర్ చేసింది. అందులో.. ఈ ఏడాది దీపాలు వెలిగించని ఇల్లు.. స్వీట్లు కూడా రుచిని కోల్పోయినట్టుగా అనిపించడం.. అంటూ ఏడాది ప్రారంభంలో చాలామందికి నష్టాలు కలిగాయని కాబట్టి.. అలాంటి వారందరికీ ఈ పండుగ చాలా చిన్నగా అనిపిస్తుందని.. అందుకే త్వరలోనే సంతోషాలు ఉంటాయని.. ఓ కొటేషన్‌ను పంచుకుంది. సమంత కూడా ఈ ఏడాది నాగచైతన్య కు బ్రేక్ అప్ చెప్పటంతో కాస్త బాధలో ఉన్నట్లు అర్థమైంది. అందుకే వాటిని మర్చిపోయి కొత్త సంతోషాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఈ విధంగా కొటేషన్‌ను పెట్టినట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా.. ఆమె ఈ విధంగా కొటేషన్‌లు షేర్‌ చేస్తుందంటే.. ఎంత బాధలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment