Samantha : విడాకుల తర్వాత స‌మంత‌.. ఎక్కువ స‌మ‌యం వాటితోనే..!

October 15, 2021 3:30 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యతో విడాకుల తర్వాత వెటర్నరీ క్లినిక్ లో కనిపించారు. తను పెంచుకునే పెట్స్ హాష్, సాషాలను వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామ్ డైవోర్స్ తర్వాత బయట కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. సామ్ చాలా సింపుల్ గా బ్లూ జీన్స్, వైట్ టాప్ తో డీసెంట్ లుక్ లో ఉంది. సమంతకు పెట్స్ అంటే మహా ఇష్టం అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పింది. ఆమె ప్రస్తుతం రెండు కుక్కపిల్లలకు కేర్ టేకర్ గా ఉంది.

Samantha spending most of the time with pets

శకుంతలం సినిమా షూటింగ్ సమయంలో కూడా తన పెంపుడు జంతువు హాష్ ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు తన స్ట్రెస్ చాలా వరకు తగ్గిందని తెలిపింది. ఆమె విడాకుల సమయంలో కూడా మరో కుక్కపిల్ల సాషాని తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆమె విడాకులు అయిన క్రమంలో ఎంతో ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఆమె పెట్స్ తోనే ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. రీసెంట్ గా ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సమంత గెస్ట్ గా వచ్చింది.

ఆమెతో కలిసి గేమ్ ఆడిన ఎన్టీఆర్ ఎంతో వినోదాన్ని అందించారు. ప్రత్యూష సపోర్ట్ కోసం 25 లక్షల రూపాయల్ని గెలుచుకున్నారు. శాకుంతలం సినిమాలో టైటిల్ రోల్ ని సమంత పోషిస్తోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో రాబోయే పౌరాణిక సినిమాలో సామ్ డబ్బింగ్ ప్రాసెస్ ని ప్రారంభించింది. నాలుగేళ్ళ వివాహబంధంలో ఎన్నో అద్భుతమైన మెమరీస్ ని దాచుకున్న ఈ క్యూట్ కపుల్ ఒక్కసారిగా విడిపోవడం భాదాకరంగా ఉందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment