Samantha : జీవితంలో తాను నేర్చుకున్న గుణ‌పాఠం ఇదే అంటున్న స‌మంత‌..!

December 5, 2021 8:34 AM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకుల‌ను తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఆమె త‌న త‌ల్లి పంపిస్తున్న కొటేష‌న్స్‌ను త‌న సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేస్తోంది. విడాకుల‌తో బాగా మ‌న‌స్థాపం చెందిన స‌మంత‌కు త‌న త‌ల్లి అండ‌గా నిలిచింది. ఆమె స‌మంత‌కు ధైర్యాన్ని చెబుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

Samantha shared a post that she learnt a lesson

ఇక స‌మంత తాజాగా షేర్ చేసిన ఇంకో కొటేష‌న్ వైర‌ల్‌గా మారింది. జీవితంలో తాను నేర్చుకున్న గుణపాఠం ఇదేన‌ని స‌మంత ఓ కొటేష‌న్ పెట్టింది. తాను జీవితంలో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌ని.. ఇదే తాను నేర్చుకున్న గుణ‌పాఠం అని తెలిపింది. దీంతో ఆమె ఈ కొటేష‌న్ ఎవ‌రిని ఉద్దేశించి పెట్టిందా.. అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

కాగా స‌మంత ప్ర‌స్తుతం పుష్ప‌లో ఓ ప్ర‌త్యేక సాంగ్‌లో న‌టిస్తుండ‌గా.. త్వ‌ర‌లో ఓ బాలీవుడ్‌, మ‌రో హాలీవుడ్ సినిమాలో న‌టించ‌నుంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ స‌మంత తాజాగా ఓ రికార్డు సృష్టించింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవ‌ర్ల సంఖ్య ప్ర‌స్తుతం 20 మిలియ‌న్లు దాటింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment