Samantha : స‌మంత నిండా మోసపోయిందా..? ఆ విష‌యంలో న‌ష్ట‌మే..?

June 5, 2022 3:27 PM

Samantha : టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ గా పేరుగాంచిన స‌మంత ఈ మ‌ధ్య వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఈమె ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర కొండ‌తో క‌లిసి ఖుషి అనే మూవీలో న‌టిస్తోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా మొద‌టి షెడ్యూల్‌ను ఇటీవలే కాశ్మీర్ లో పూర్తి చేశారు. దీంతోపాటు య‌శోద అనే సినిమాలోనూ స‌మంత న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి కాగా ఆగ‌స్టులో ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. అయితే స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమా గురించే ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు.

శాకుంత‌లం సినిమా పౌరాణిక గాథ ఆధారంగా తెర‌కెక్కింది. గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే స‌మంత ఈ మూవీకి గాను షూటింగ్‌, డ‌బ్బింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. కానీ సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మొన్నా మ‌ధ్య స‌మంత బ‌ర్త్ డే సందర్భంగా ఆమె ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే అది అంతా నాసిర‌కంగా ఉంద‌ని కామెంట్లు వ‌చ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ అస‌లు బాగాలేవ‌ని చాలా మంది పెద‌వి విరిచారు. అయితే ఆ త‌రువాత శాకుంత‌లం సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో అస‌లు ఈ సినిమాకు ఏమైంది.. అని ప్రేక్ష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

Samantha Shakunthalam movie may release very latley
Samantha

అయితే ప్ర‌స్తుతం శాకుంత‌లం సినిమాకు గాను గ్రాఫిక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. కానీ ఈ సినిమాలో స‌మంత లుక్ బాగా లేద‌ని స‌హ నిర్మాత దిల్ రాజు అసంతృప్తిని వ్య‌క్తం చేశార‌ట‌. అలాగే గ్రాఫిక్స్ కూడా అంత బాగా రాలేద‌ని అంటున్నారు. ఇదే విష‌యంపై స‌మంత కూడా అసంతృప్తిగానే ఉంద‌ట‌. దీంతో ఈ సినిమా అస‌లు విడుద‌ల‌వుతుందా.. కాదా.. అయితే ఎప్పుడు అవుతుంది.. అన్న వివ‌రాలేవీ తెలియ‌డం లేదు. అయితే సినిమాను మ‌ళ్లీ తీయ‌డం కుద‌ర‌దు. క‌నుక ఎలా వ‌చ్చినా స‌రే దాన్ని విడుద‌ల చేయాల్సిందే. అదే జ‌రిగితే స‌మంత నిండా మోస‌పోయినట్లేన‌ని అంటున్నారు. ఎందుకంటే నాసిర‌కంగా సినిమాను రిలీజ్ చేస్తే ముందుగా స‌మంత‌నే అంటారు. ఇది ఆమెకు బాగా మైన‌స్ అవుతుంది. దీని ప్రభావం ఆమె త‌దుప‌రి సినిమాల‌పై ప‌డుతుంది. కాబ‌ట్టి శాకుంత‌లం విష‌యంలో ఆమెకు బాగానే న‌ష్టం జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment