Samantha Rashmika Mandanna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమంత ఎన్నో విభిన్న పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఆఫర్స్ కూడా దక్కించుకుంటోంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత చాలా మంది హీరోయిన్లతో మంచి ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సమంత ఓ స్టార్ హీరోయిన్ కు ఊహించని గిఫ్ట్ పంపి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు ఓ మెరుపులా దూసుకుపోతున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న రష్మికకి సమంత ఇటీవల సాకీ బ్రాండ్ నుంచి గిఫ్ట్ హాంపర్ ని పంపింది. ఇలా సమంత గిఫ్ట్ పంపించడంతో రష్మిక ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే సమంత పంపిన గిఫ్ట్ పై రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. కంగ్రాట్స్ బ్యూటిఫుల్ లేడీ. సాకీ కోసం నువ్వు చాలా చేస్తున్నావు. నువ్వు పంపిన గిఫ్ట్ నాకు నచ్చింది’ అని రష్మిక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే రష్మిక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో శ్రీవల్లి అనే ఒక గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…