Idhe Maa Katha Review : ఇది మా కథ రివ్యూ.. ఒక జర్నీ.. నాలుగు కథలు.. సినిమా ఎలా ఉందంటే ?

Idhe Maa Katha Review : సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ఇది మా కథ’. గురు పవన్ దర్శకుడు. శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ గొల్లా నిర్మించారు. రోడ్ జర్నీ అడ్వంచర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఈరోజు (అక్టోబర్ 2, 2021) విడుదలైంది. మరి జర్నీ సజావుగా సాగిందో లేదో రివ్యూలో చూద్దాం..

Idhe Maa Katha Review : కథ

మహేంద్ర (శ్రీకాంత్), అజయ్ (సుమంత్ అశ్విన్), లక్ష్మీ (భూమిక), మేఘన (తాన్య హోప్) అనే నలుగురు వ్యక్తుల బైక్ జర్నీనే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఒకరికి, మరొకరికి పరిచయం లేని ఈ నలుగురూ వేర్వేరు లక్ష్యాలతో లఢఖ్ కి బైక్ జర్నీ స్టార్ట్ చేస్తారు. నలుగురివీ నాలుగు కథలు. నాలుగు కుటుంబ నేపథ్యాలు. మరి ఈ నలుగురు ఎలా కలుసుకున్నారు. వీరి మధ్య ఫ్రెండ్ షిప్ ఎలా డెవలప్ అయింది.. తమ లక్ష్యాలను చేరుకున్నారా.. ఈ జర్నీలో ఒకరికి మరొకరు ఎలా హెల్ప్ అయ్యారు అనేది మిగతా కథ.

ఎవరెలా..

మహేంద్రా పాత్రలో ఒదిగిపోయాడు శ్రీకాంత్. మరోసారి తన మార్క్ చూపించింది భూమిక. ఓ వైపు హౌస్ వైఫ్ గా, మరోవైపు తన తండ్రి డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసే లక్ష్మి పాత్రలో భూమిక నటన ఆకట్టుకుంది. వీరిద్దరి నటన సినిమాకి ప్లస్. ఇక అడ్వంచర్ అజయ్ అనే యూట్యూబర్ గా కనిపించిన సుమంత్ అశ్విన్ ఎప్పటిలాగే సోసోగా సరిపెట్టేశాడు. తన అభినయం మాటెలా ఉన్నా గత చిత్రాల్లో అందంగానైనా కనిపించాడు. ఇందులో కొత్తగా ఉంటుందని ట్రై చేసిన హెయిర్ స్టైల్ తో వింతగా కనిపించాడు. ఫస్ట్ హాఫ్‌ లో సప్తగిరి, సెకండాఫ్ లో థర్టీ ఇయర్స్ పృథ్విలతో చేసిన కామెడీ ట్రాక్స్ నవ్వించకపోగా స్టోరీకి స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, పమ్మిసాయి లాంటి వాళ్లంతా పాత్రల పరిధిమేరకు నటించారు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించినా, శ్రీకాంత్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే పాట మళ్లీ మళ్లీ వినాలపించేలా ఉంది. ఇలాంటి రోడ్ జర్నీ సినిమాని మరింత అందంగా చూపించే అవకాశం ఉన్నా ఆ వైపు ఫోకస్ పెట్టినట్టు అనిపించలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతంతమాత్రమే. ముఖ్యంగా సీజీ వర్క్స్ తేలిపోయాయి.

ఎలా ఉందంటే..?

రోడ్ జర్నీ సినిమాలు అనగానే జిందగీ న మిలేగి దుబారా, జబ్ వుయ్ మెట్, హైవే, కార్వాన్ లాంటి హిందీ సినిమాలు ఎక్కువ గుర్తొస్తాయి. తెలుగులో ఈ జానర్ సినిమాలు అరుదు. అయినప్పటికీ కంటెంట్ నచ్చితే ఏ జానర్ సినిమానైనా తెలుగు ప్రేక్షకులు హిట్ చేస్తారు. ఎటొచ్చి కథను కన్విన్సింగ్ గా, ఎంగేజింగ్ గా చెప్పడమే అవసరం. ఈ సినిమా విషయంలో రోడ్ జర్నీ సినిమాకు కావలసిన చక్కని కంటెంట్ నే తీసుకున్న దర్శకుడు, కన్విన్సింగ్ గా చెప్పడంలో మాత్రం తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్‌ వరకూ ఎలాగోలా కథ నడిపినా సెకండాఫ్ లో అనవసర కామెడీ, విలన్ సీన్స్ ని జొప్పించి విసుగు తెప్పించాడు. నాలుగు ప్రధానపాత్రల పర్సనల్ లైఫ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బైక్ జర్నీలో వాళ్లకు ఎదురయ్యే స్ట్రగుల్స్ కి కూడా ఇచ్చుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ముఖ్యంగా శ్రీకాంత్, భూమిక క్యారెక్టర్స్ పై పెట్టిన శ్రద్ధ, సుమంత్ అశ్విన్, తాన్యా క్యారెక్టర్స్ లో కనిపించదు. నిజానికి ఈ తరహా సినిమాలకి జర్నీలో ఎదురయ్యే స్ట్రగుల్సే మెయిన్ విలన్స్. కానీ ఇందులో బలవంతంగా విలనిజం, కామెడీ లాంటివి జొప్పించాలనే ప్రయత్నం చేయడంతో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోకి వచ్చేసింది. మొత్తానికి కంటెంట్ పరంగా మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో విఫలమయ్యారు. ఫైనల్ గా.. ఎలాంటి అంచనాలు లేకుండా టైమ్ పాస్ కి అయితే ఓసారి చూసేయొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM