Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం నుంచి ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. కేవలం 45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో దర్శకుడు ఎంతో అద్భుతంగా చూపించారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో అధిక వ్యూస్ తో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ గ్లింప్స్ వీడియో పై సమంత స్పందించింది. ఈ వీడియో చూసిన సమంత సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేస్తూ.. వామ్మో అనే ఎమోజీని పోస్ట్ చేయడమే కాకుండా, గుడ్ లక్ అంటూ టీమ్‌కు విషెస్ చెప్పింది. ఈ పోస్ట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…