Samantha : ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌ పై సమంత స్పందన.. ఏమన్నదంటే..?

November 2, 2021 4:59 PM

Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Samantha response on rrr glimpse video

ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం నుంచి ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు. కేవలం 45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో దర్శకుడు ఎంతో అద్భుతంగా చూపించారు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో అధిక వ్యూస్ తో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ గ్లింప్స్‌ వీడియో పై సమంత స్పందించింది. ఈ వీడియో చూసిన సమంత సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేస్తూ.. వామ్మో అనే ఎమోజీని పోస్ట్‌ చేయడమే కాకుండా, గుడ్ లక్ అంటూ టీమ్‌కు విషెస్‌ చెప్పింది.  ఈ పోస్ట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now