Samantha : స‌మంత మెసేజ్‌.. పెద్ద‌వాళ్ల‌కు మాత్ర‌మే.. కొన్ని రోజులు ఆ ప‌ని మానుకోండి.. అంటూ సూచ‌న‌..!

November 4, 2021 3:03 PM

Samantha : నాగ‌చైతన్య‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం స‌మంత సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. కొద్ది రోజుల పాటు ఆమె ఒత్తిడి అంతా పోయేందుకు టూర్లు వేసింది. ఇప్పుడు మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ సందేశాలు ఇస్తోంది. ఇక తాజాగా దీపావ‌ళి సందర్భంగా స‌మంత.. పెద్ద‌వాళ్ల‌కు మాత్ర‌మే అంటూ.. పెట్టిన పోస్ట్ ఒక‌టి వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ అందులో ఏముందంటే..

Samantha requests not to ban crackers on diwali

దీపావ‌ళి పండుగ అన‌గానే ప్ర‌తి ఒక్క‌రికీ ప‌టాకులు గుర్తుకు వ‌స్తాయి. చిన్నారులు బాణ‌సంచా కాల్చేందుకు మిక్కిలి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు జ‌గ్గీ వాసుదేవ్ ట్విట్ట‌ర్‌లో వీడియో సందేశం ఇచ్చారు. దాన్ని స‌మంత త‌న ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

చిన్న‌త‌నంలో దీపావ‌ళికి బాంబులు కాల్చాల‌ని ఎంతో ఇష్టం ఉండేద‌ని, కానీ త‌న‌కు ఆ ప‌ని సాధ్యం కాలేద‌ని జ‌గ్గీ వాసుదేవ్ చెప్పారు. అయితే చిన్నారుల కోస‌మైనా బాణసంచాపై ఉన్న నిషేధాన్ని తొల‌గించాల‌ని, వారి ఆనందానికి అడ్డుక‌ట్ట వేయొద్ద‌ని ఆయ‌న కోరారు.

అయితే మ‌రి ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం ఎలా ? అంటే.. అందుకు ఆయ‌న ఓ స‌ల‌హా ఇచ్చారు. దీపావళికి కాలుష్యం బాగా పెరిగిపోతుంది క‌నుక కొన్ని రోజులు పెద్ద‌వారు వాహ‌నాల‌ను వాడ‌డం మానేయండి. కాలిన‌డ‌క‌న వెళ్లండి. లేదంటే ప్ర‌జా ర‌వాణాను ఉప‌యోగించండి. దీంతో కాలుష్యం త‌గ్గుతుంది. అంతేకానీ కాలుష్యం పేరు చెప్పి దీపావ‌ళి రోజు చిన్న పిల్ల‌ల స‌ర‌దాల‌ను, ఆనందాల‌ను దూరం చేయొద్ద‌ని ఆయ‌న కోరారు.

ఇక స‌మంత కూడా ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు చెందిన వీడియోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయ‌డ‌మే కాక‌.. ఆమె కూడా దీపావ‌ళి క్రాక‌ర్స్‌ను బ్యాన్ చేయ‌వ‌ద్ద‌ని కోరింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. పెద్ద‌వాళ్లు కొన్ని రోజులు ఆ విధంగా చేస్తే మంచిద‌ని సూచిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment