Samantha : ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. అయితే గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్ లైఫ్‌తోపాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్.. ఇలా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే సామ్ మాత్రం ఇవన్నీ లైట్ తీసుకుంది. అంతేకాదు సోషల్ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్న వీళ్ళు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకు విడిపోయారు అనే దానిపై సామ్ తన సోషల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తుందే తప్ప అసలు విషయం చెప్పడం లేదు. నాగ చైతన్య కూడా ఇంత వరకు విడాకుల నిర్ణయంపై నోరు విప్పలేదు. తాజాగా నాగార్జున కూడా వీరి విడాకుల నిర్ణయంపై షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే విడాకుల తర్వాత సమంత అనేక ఆశ్రమాలకు దాన ధర్మాలు చేయడమే కాకుండా ఒక ఆశ్రమంలో సమంత ఈమధ్య ఒక హోమం చేసినట్లు వచ్చిన వార్తలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
వాస్తవానికి సమంత క్రిష్టియన్.. నాగచైతన్యతో పెళ్ళి జరిగినప్పుడు హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి రెండుసార్లు జరిగింది. చైతూ నుండి విడిపోయినా సమంత హిందూ ధర్మాలని పాటిస్తుంది. ఆలయాలకు వెళ్ళడం వల్ల మనశ్శాంతి కలిగి.. తాను ఏమిటో తనకు అర్థం అయ్యేలా ఉంది అంటూ ఆమధ్య కామెంట్స్ చేసింది. ఇక సమంత హైదరాబాద్ లోని కొన్ని ఆశ్రమాలకు భారీ విరాళాలు ఇస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు క్రిష్టియన్ సాంప్రదాయాలు కొనసాగిస్తూనే హిందూ ఆలయాలపై, ఆశ్రమాలపై సమంతకు ఎందుకు ఆసక్తి పెరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. దీనిపై సమంత స్పందిస్తే తప్ప అసలు విషయం తెలీదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…