Regina Cassandra : రెజీనా కసాండ్ర అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. తన హాట్ గ్లామరస్ లుక్ తో ప్రస్తుతం అందరినీ తనవైపు ఆకర్షిస్తుంది. ఆమెతోపాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్లు మొత్తం స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ రెజీనా మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది.
టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి మంచి సినిమాలు చేసిన రెజీనాకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రంలో సానా కష్టం వచ్చిందే మందాకిని అనే ఐటెం సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం రెజీనా, నివేతా థామస్ కలిసి నటించిన శాకిని డాకిని విడుదలైంది. ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇప్పటికీ తన కెరీర్ ను ఎలా సరైన సక్సెస్ ట్రాక్ లో పెట్టుకోవాలో అవగాహన చేసుకోలేకపోతుంది.
ఇక ఈ మధ్య రెజీనా ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. తన హాట్ గ్లామర్ షోతో ఇండస్ట్రీలో అందరికళ్ళు తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా రెజీనా మాటతీరు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. రీసెంట్ గా నివేథా థామస్ తో కలిసి నటించిన శాకిని డాకిని టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రెజీనా మాట్లాడే తీరు అందరినీ ఆకర్షించడమే కాకుండా, సోషల్ మీడియాలో రెజీనా కామెంట్స్ తో వైరల్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మ్యాగీ రెండు నిమిషాల మగాడు కామెంట్స్ తో డబుల్ మీనింగ్ జోక్ లు పేల్చి ఒక్క సారిగా సెన్సేషన్ అయ్యింది రెజినా.
రెజీనా బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో ఘాటుగా విమర్శిస్తూ చేస్తున్న వ్యాఖ్యలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇక రీసెంట్ గా రెజీనా లిప్ లాక్ మీద చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. నేనేదో వేరే పనిలో ఉండగా.. ఒక మహిళ వచ్చి, ఒకసారిగా నా పెదాలను కిస్ చేసింది. సడెన్‌గా జరిగిన ఆ సంఘటనతో నేను షాక్ అయ్యాను. కానీ కిస్ చేసింది ఓ మహిళ కావడంతో ఆమెను వెనక్కి నెట్టకుండా సైలెంట్ గా ఉన్నాను. అయితే అదే పని మగాడు చేసి ఉంటే మాత్రం అక్కడికక్కడే చెంప పగలకొట్టేదానిని అంటూ రెజీనా ఇంటర్వ్యూ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇప్పుడు రెజీనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…