Samantha : భారీగా విరాళాలు ఇస్తున్న స‌మంత‌.. కార‌ణం ఏమిటి..?

September 16, 2022 4:20 PM

Samantha : ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. అయితే గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్‌ లైఫ్‌తోపాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్.. ఇలా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే సామ్‌ మాత్రం ఇవన్నీ లైట్‌ తీసుకుంది. అంతేకాదు సోషల్‌ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటుంది.

టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్న వీళ్ళు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకు విడిపోయారు అనే దానిపై సామ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తుందే త‌ప్ప అస‌లు విషయం చెప్ప‌డం లేదు. నాగ చైత‌న్య కూడా ఇంత వ‌ర‌కు విడాకుల నిర్ణ‌యంపై నోరు విప్ప‌లేదు. తాజాగా నాగార్జున కూడా వీరి విడాకుల నిర్ణ‌యంపై షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే విడాకుల త‌ర్వాత సమంత అనేక ఆశ్రమాలకు దాన ధర్మాలు చేయడమే కాకుండా ఒక ఆశ్రమంలో సమంత ఈమధ్య ఒక హోమం చేసినట్లు వచ్చిన వార్తలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Samantha reportedly giving huge donations why
Samantha

వాస్తవానికి సమంత క్రిష్టియన్.. నాగచైతన్యతో పెళ్ళి జరిగినప్పుడు హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి రెండుసార్లు జరిగింది. చైతూ నుండి విడిపోయినా స‌మంత హిందూ ధ‌ర్మాల‌ని పాటిస్తుంది. ఆలయాలకు వెళ్ళడం వల్ల మనశ్శాంతి కలిగి.. తాను ఏమిటో తనకు అర్థం అయ్యేలా ఉంది అంటూ ఆమధ్య కామెంట్స్ చేసింది. ఇక సమంత హైదరాబాద్ లోని కొన్ని ఆశ్రమాలకు భారీ విరాళాలు ఇస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు క్రిష్టియన్ సాంప్రదాయాలు కొనసాగిస్తూనే హిందూ ఆలయాలపై, ఆశ్రమాలపై సమంతకు ఎందుకు ఆసక్తి పెరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. దీనిపై సమంత స్పందిస్తే తప్ప అసలు విషయం తెలీదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment