Samantha : నాగచైతన్య నుంచి రూ.200 కోట్ల భరణం తిరస్కరించిన సమంత.. కారణం అదే!

October 3, 2021 8:56 PM

Samantha : సమంత, నాగ చైతన్యల గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ కాకుండా జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారింది. గత కొంతకాలం నుంచి వీరి గురించి వస్తున్న వార్తలు నిజమని శనివారం సమంత, నాగ చైతన్య అధికారికంగా తెలియజేశారు. ఇకపోతే భర్త నుంచి విడిపోయిన భార్యకు తన భర్త ఆస్తిలో కొంత భాగం భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత.. నాగచైతన్య నుంచి భరణంగా రూ.200 కోట్లు తీసుకోబోతునట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Samantha : నాగచైతన్య నుంచి రూ.200 కోట్ల భరణం తిరస్కరించిన సమంత.. కారణం అదే!

ఈ క్రమంలోనే సమంతకు భరణంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నట్లు, అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయగా సమంత మాత్రం తనకు ఏ విధమైన డబ్బులు అవసరంలేదని.. డబ్బు కోసం తాను పెళ్లి చేసుకోలేదని, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, డబ్బు కోసం కాదు కనుక తాను ఎలాంటి భరణం ఆశించలేదని.. సమంత సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.

ఏం మాయ చేశావే.. సినిమా ద్వారా పరిచయం ఏర్పర్చుకొని ఆ తర్వాత ప్రేమ, పెళ్లి బంధంతో ఒకటైన వీరి బంధాన్ని డబ్బుతో లెక్క కట్టకూడదని, అందుకే సమంత రూ.200 కోట్లు తీసుకోవడానికి ఇష్టత చూపలేదని, విడాకుల విషయం తెలియగానే తన హృదయం ముక్కలైపోయిందని సమంత సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ బాధ నుంచి బయట పడటం కోసం సమంత తన ప్రొఫెషనల్ వర్క్ పై దృష్టి పెడుతోందని సన్నిహితులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment