Samantha : నిర్మాత‌ల‌కు కొత్త కండిష‌న్స్ పెడుతున్న స‌మంత‌.. అలా అయితేనే సైన్ చేస్తా..!

October 17, 2021 8:30 PM

Samantha :  ఒక‌ప్పుడు స్టార్ హీరోలు మాత్ర‌మే కొన్ని కండిష‌న్స్ పెట్టేవారు. ఇప్పుడ‌లా కాదు.. కొంద‌రు క‌థానాయిక‌లు కూడా నిర్మాత‌ల‌కు కండిష‌న్స్ పెట్టి వారిని ఇబ్బందుల‌కి గురి చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత కూడా చేరింది. విడాకుల త‌ర్వాత స‌మంత సినిమాల స్పీడ్ పెంచిన విష‌యం తెలిసిందే.

Samantha new conditions to producers

రీసెంట్‌గా స‌మంతకి సంబంధించిన రెండు సినిమాల‌పై అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న 30వ సినిమాలో సమంత నటించబోతుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ తెరకెక్కించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తోన్న తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంలోనూ సమంత నటించనుంది.

ఈ చిత్రానికి హరి, హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్నారు. వీరికి ఇదే తొలి సినిమా. నవంబర్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు చిత్ర టీమ్ వెల్లడించింది. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాల‌ను త్వరలో ప్రకటించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ ద్విభాషా చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసిన సమంత తన తదుపరి చిత్రాల నిర్మాతలకు కొత్త షరతులు పెడుతోంది.

షూటింగ్ ల కోసం మెజారిటీ పార్ట్ చెన్నై లేదా ఆ చుట్టుపక్కల లొకేషన్లను ఎంచుకోవాలని సమంత దర్శక నిర్మాతలను కోరుతుంద‌ట. హైదరాబాద్ లో షూటింగులు చేయడానికి ఆమె ఇష్టపడడంలేదు. ఒకవేళ హైదరాబాద్‌లో తప్పనిసరిగా చిత్రీకరించాలనుకుంటే కేవలం ఇండోర్ మాత్రమే ప్లాన్ చేయాలి. ఇండోర్ లొకేషన్లు సెట్లలో షూట్ చేయాలి. ఆరు బ‌య‌ట షూటింగ్ వ‌ద్దు అని ప్ర‌త్యేక‌మైన కండిష‌న్స్ పెడుతోంద‌ట‌. మ‌రి వాటికి కార‌ణాలు ఏంట‌నేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment