Samantha Movie OTT : స‌మంత కొత్త సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?

Samantha Movie OTT : ఈ మ‌ధ్య కాలంలో స‌మంత ప‌లు వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత సినిమాలు, సిరీస్‌ల‌తో ఎంతో బిజీగా మారిపోయింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామ‌ర్ డోసును ఇంకాస్త పెంచింది. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డు అనేక మ్యాగ‌జైన్‌ల‌కు క‌వ‌ర్ ఫొటోల‌కు ఇచ్చిన పోజులు వైర‌ల్ అయ్యాయి. దీంతో స‌మంత అందాల జాత‌ర‌ను చూసి అంద‌రూ షాక్‌కు గుర‌వుతున్నారు. గతంలో ఎన్న‌డూ లేనంత‌గా స‌మంత హ‌ద్దులు చెరిపేస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఇక స‌మంత ఈ మ‌ధ్య కాలంలో న‌టించిన క‌ణ్మ‌ణి రాంబో ఖ‌తీజా మూవీ నిరాశ ప‌రిచింది. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది.

స‌మంత‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తిలు ప్ర‌ధాన పాత్రల్లో వ‌చ్చిన క‌ణ్మ‌ణి రాంబో ఖ‌తీజా మూవీ తెలుగులో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అసలు తొలి రోజే ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 80 శాతానికి పైగా థియేట‌ర్ల‌లో ఒక్క‌టంటే ఒక్క టిక్కెట్ కూడా బుక్ కాలేదు. దీంతో స‌మంత తొలిసారిగా ఇంత‌టి డిజాస్ట‌ర్‌ను మూట‌గట్టుకుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే త‌మిళంలో మాత్రం ఇదే సినిమా హిట్ అయింది. అక్క‌డ దీన్ని కాతువాకుల రెండు కాద‌ల్ పేరిట విడుద‌ల చేశారు. ఇక ఈ మూవీకి గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీని మే 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. అయితే థియేట‌ర్ల‌లో హిట్ కాని ఈ సినిమా ఓటీటీలో అయినా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Samantha Movie OTT

ఇక స‌మంత తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి న‌టిస్తోంది. ఒక‌ప్ప‌టి ప‌వ‌న్ మూవీ ఖుషి టైటిల్ తో స‌మంత‌, విజ‌య్ ల మూవీని లాంచ్ చేశారు. అలాగే ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేశారు. అయితే దీనిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇక ఇదే కాకుండా స‌మంత శాకుంత‌లం అనే పౌరాణిక చిత్రంతోపాటు య‌శోద అనే సైన్స్ ఫిక్ష‌న్ మూవీలోనూ న‌టిస్తూ.. ఎంతో బిజీగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM