Amazon Prime Video : యష్ హీరోగా కేజీఎఫ్‌కు సీక్వెల్ గా వచ్చిన మూవీ కేజీఎఫ్ 2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను నమోదు చేస్తోంది. హిందీ మార్కెట్‌లో బాహుబలి 2 తరువాత అత్యధిక కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. అయితే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించారు. అమెజాన్ ప్రైమ్ అందుకు గాను డిజిటల్ హక్కులను కూడా కొనుగోలు చేసింది. కానీ ప్రేక్షకులకు ఆ సంస్థ ఒక్కసారిగా షాకిచ్చింది. ఎందుకంటే ఓటీటీలో వస్తే సహజంగానే సినిమాను ఉచితంగానే చూస్తామన్న భావనలో ప్రేక్షకులు ఉన్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ అయినపప్పటికీ ఈ మూవీని చూడాలంటే రూ.199 చెల్లించాలని అమెజాన్ ప్రైమ్ షరతు విధించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ నిర్ణయంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఆ సంస్థను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
కేజీఎఫ్ 2 సినిమాను చూడాలంటే రూ.199 చెల్లించి పే పర్ వ్యూ పద్ధతిలో చూడాలని అమెజాన్ ప్రైమ్ షరతు పెట్టింది. అయితే ఇలాంటి మోడల్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. భారత్‌లోనే కొత్త. దీంతో ఇప్పటికే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు చెల్లించాం కదా.. ఇప్పుడు ఈ కొత్త మెలిక ఏమిటి ? ఓటీటీలో సినిమా వస్తే ఉచితంగానే చూస్తున్నాం కదా.. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని ఎందుకు అడుగుతున్నారు ? అంటూ ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్‌ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసేందుకు డబ్బులు చెల్లించాల్సి వస్తే.. అంత మాత్రానికి ఎంతో ధర పెట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవడం ఎందుకు ? ఇది కచ్చితంగా దోపిడీయే అని ఆ సంస్థపై ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో అమెజాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఇక పే పర్ వ్యూ పద్ధతిలో రూ.199 కి సినిమా అందుబాటులో ఉండడంతో కొందరు వెబ్‌సైట్ల నిర్వాహకులు ఈ మూవీని కాపీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దీంతో ఎలాంటి రుసుము లేకుండానే ఈ మూవీ ఆన్‌లైన్‌లో ఉచితంగా పలు టోరెంట్ సైట్లలో లభిస్తోంది. ఈ క్రమంలోనే తాము రూ.199 చెల్లించకుండానే సినిమా హెచ్‌డీ ప్రింట్‌ను పొందుతున్నామని ప్రేక్షకులు అమెజాన్‌కు ట్వీట్ చేస్తున్నారు. ఇక కొందరు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్‌ను వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ 2 విషయంలో అమెజాన్ ప్రైమ్ కు సెగ తగిలిందనే చెప్పవచ్చు. మరి దీనిపై అమెజాన్ ప్రైమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…