Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్యల జంట చూడముచ్చటగా ఉంటుంది. దాదాపు 10 ఏళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారు. నాలుగేళ్ళుగా వివాహ బంధంలో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ విడాకులు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ అయ్యాయి. ఆ వార్తల్నే నిజాలు చేస్తూ అక్టోబర్ 2వ తేదీన చై సామ్ లు విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో కాస్త ప్రైవసీ ఇవ్వమని తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చాక.. రోజుకో వార్తతో ఫుల్ గా రోస్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా యూట్యూబ్ ఛానెల్స్ లో పలు రకాల థంబ్ నెయిల్స్ హల్ చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సమంతపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. సమంతనే విడాకులకు కారణమా అంటూ టైటిల్స్ పెట్టారు. దాంతో పాటు సమంత, నాగచైతన్యల విడాకులకు సామ్ స్టైలిస్ట్ జుకల్కర్ కారణం అంటూ సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు కూడా ఫుల్ ట్రెండ్ అయ్యాయి.
తన డిజైనర్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ ఉన్న ఫోటోస్ ని కూడా షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత దృష్టికి వచ్చిన ఈ ట్రోల్స్ తో తన పేరును, ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉండటంతో సోషల్ మీడియాలో, డిజిటల్ కంటెంట్ పై చట్టపరమైన చర్యల్ని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ కెరీర్ కి ఇబ్బంది పడేలా థంబ్ నెయిల్స్ ఉన్నాయని.. ఈ విషయంపై సామ్ సీరియస్ గా రెస్పాన్డ్ అవుతుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…