Samantha : మీడియాలో స‌మంత‌పై త‌ప్పుడు వార్త‌లు.. లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా స‌మంత‌..?

October 6, 2021 6:52 PM

Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్యల జంట చూడముచ్చటగా ఉంటుంది. దాదాపు 10 ఏళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారు. నాలుగేళ్ళుగా వివాహ బంధంలో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ విడాకులు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ అయ్యాయి. ఆ వార్తల్నే నిజాలు చేస్తూ అక్టోబర్ 2వ తేదీన చై సామ్ లు విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Samantha may take legal action on those who create false news

తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో కాస్త ప్రైవసీ ఇవ్వమని తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చాక.. రోజుకో వార్తతో ఫుల్ గా రోస్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా యూట్యూబ్ ఛానెల్స్ లో పలు రకాల థంబ్‌ నెయిల్స్ హల్ చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సమంతపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. సమంతనే విడాకులకు కారణమా అంటూ టైటిల్స్ పెట్టారు. దాంతో పాటు సమంత, నాగచైతన్యల విడాకులకు సామ్ స్టైలిస్ట్ జుకల్కర్ కారణం అంటూ సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు కూడా ఫుల్ ట్రెండ్ అయ్యాయి.

తన డిజైనర్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ ఉన్న ఫోటోస్ ని కూడా షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత దృష్టికి వచ్చిన ఈ ట్రోల్స్ తో తన పేరును, ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉండటంతో సోషల్ మీడియాలో, డిజిటల్ కంటెంట్ పై చట్టపరమైన చర్యల్ని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ కెరీర్ కి ఇబ్బంది పడేలా థంబ్‌ నెయిల్స్ ఉన్నాయని.. ఈ విషయంపై సామ్ సీరియస్ గా రెస్పాన్డ్ అవుతుందని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now