Samantha : వామ్మో.. స‌మంత ఏంటి.. రోజు రోజుకీ మ‌రీ ఇంత‌లా రెచ్చిపోతోంది.. వీడియో..!

April 15, 2022 7:13 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత వ్య‌వ‌హార శైలిలో కాస్త మార్పు వ‌చ్చింద‌నే చెప్పాలి. జోరుగా సినిమాలు చేస్తూనే ఐట‌మ్ సాంగ్స్ కూడా చేయ‌గ‌ల‌న‌ని చాటి చెప్పింది. అలాగే సిరీస్‌ల‌లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. ఇక ఈ ఏడాది స‌మంత జోరు మామూలుగా ఉండ‌ద‌నే చెప్పాలి. ఆమె న‌టించిన సినిమాలు ఈ ఏడాదిలో వ‌రుస‌గా రిలీజ్ కానున్నాయి. అయితే స‌మంత‌కు న‌టిగా మంచి గుర్తింపు ఉన్నా.. ఆమె గ్లామ‌ర్ షో చేయ‌డం మాత్రం ఆప‌డం లేదు. ప్ర‌స్తుత త‌రుణంలో కాంపిటీష‌న్ వ‌స్తున్న హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా స‌మంత అందాల‌ను ఆరబోస్తోంది.

Samantha latest cover photo video viral
Samantha

తాజాగా స‌మంత ఓ మ్యాగ‌జైన్‌కు క‌వర్ ఫొటోషూట్ చేసిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఎద అందాల‌ను ఆర‌బోస్తూ ఆమె దుస్తులు ధ‌రించింది. ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక వాటి తాలూకు వీడియో ప్ర‌స్తుతం రిలీజ్ అయింది. దీంతో ఆ వీడియో కూడా వైర‌ల్ అవుతోంది. ఇక ఫొటోల్లో క‌న్నా వీడియోలోనే స‌మంత ఎక్కువ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుండడం విశేషం. దీంతో స‌మంత జోరు చూసి అంద‌రూ షాక‌వుతున్నారు. ఆమె రోజు రోజుకీ ఇంత‌లా రెచ్చిపోతుందేమిటి ? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక ఆమె వీడియోను కూడా చాలా మంది ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత ప్ర‌స్తుతం ప‌లు షూటింగ్‌ల‌లో పాల్గొంటోంది. ఆమె న‌టించిన కాతు వాకుల రెండు కాద‌ల్ అనే త‌మిళ మూవీ ఈ నెల 28వ తేదీన విడుద‌ల కానుంది. అలాగే మ‌రో సినిమా య‌శోద ఆగ‌స్టులో రిలీజ్ అవ‌నుంది. దీంతోపాటు శాకుంత‌లం అనే పౌరాణిక చిత్రంలోనూ స‌మంత న‌టించ‌గా.. ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. దీని విడుద‌ల తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. ఏది ఏమైనా స‌మంత ఇటీవ‌లి కాలంలో స్కిన్ షోను ఎక్కువ చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment