Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి దూరమ్యాడనే బాధ కూడా లేదు. తన ఫ్రెండ్స్‌తో చక్కగా టూర్స్ వేస్తోంది. ఇదంతా బాధ నుండి బయట పడడానికే అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం సమంతపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇక రీసెంట్‌గా స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్‌ధామ్ యాత్రను సందర్శించింది. చార్‌ధామ్ యాత్ర గురించి సమంత ఓ పోస్టును షేర్ చేసింది.. ‘మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గధామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకున్నాను. హిమాలయాలను సందర్శించాలనే నా కల నెరవేరింది. దేవుడి మీద నమ్మకం, ప్రస్తుతం ఉండే వాస్తవికత మధ్య ఎప్పుడూ సంక్లిష్టమైన గందరగోళం ఉంటుంది. శిల్పా రెడ్డితో ఈ ప్రయాణం సాగించడం వల్ల మరింత ప్రత్యేకమైందిగా మారింది’ అని చెప్పుకొచ్చింది.
తాజాగా సమంత మరో ట్రిప్ ప్లాన్ చేసింది. తన పర్సనల్ డిజైనర్, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్‌లతో కలిసి సామ్ దుబాయ్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఫారిన్‌కు వెళ్తున్నాం అని పేర్కొంది. దీంతో ప్రీతమ్ పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. ప్రీతమ్ వల్లనే చైతూతో సమంత విడిపోయిందనే వార్తలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…