Samantha : కెరీర్‌లో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ముందుకు పోతున్న అందాల ముద్దుగుమ్మ సమంత. విడాకుల తర్వాత సమంత జోరు మాములుగా లేదు. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్రతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషలలోనూ సినిమాలు చేసేందుకు సై అంటోంది. సమంత ముఖ్యంగా వైవిధ్యమైన పాత్రలలో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.
అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ చిత్రంలో సమంత ద్విలింగ సంపర్కురాలి (బైసెక్సువల్) పాత్రలో నటిస్తోందని ఇందులో డిటెక్టివ్ షేడ్ కూడా ఉంటుందని కూడా కథనాలొస్తున్నాయి. ద్విలింగ మహిళ అంటే సమాజంలో వారిని గుర్తించడం అంత సులువు కాదు. ఇతర మహిళల పట్ల ఆకర్షితులుగా ఉంటూ.. వారి అందాన్ని పదే పదే ప్రశంసించే మహిళలను ద్విలింగ మహిళగా గుర్తించాలి. ఈ పాత్రలో సమంత నటించనుండడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
సమంతకు ఈ పాత్ర రావడం వెనుక దగ్గుబాటి హీరో రానా ఉన్నాడట. సమంతను, ఓ బేబీ ఫేం సునీత తాటిని కలిపింది రానా అనే అంటున్నారు. సునీత తాటిని కలిసి కథ విన్నవెంటనే సామ్ ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఏమాత్రం సంశయించలేదట. వెంటనే ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంత తెలుగులో శ్రీదేవి మూవీస్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కి సంతకం చేసింది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…