Samantha : ఆ హీరో వల్లే సమంతకు హాలీవుడ్‌ సినిమా ఆఫర్‌..?

November 29, 2021 1:59 PM

Samantha : కెరీర్‌లో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తూ ముందుకు పోతున్న అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. విడాకుల త‌ర్వాత స‌మంత జోరు మాములుగా లేదు. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్ర‌తో అద‌ర‌గొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాష‌ల‌లోనూ సినిమాలు చేసేందుకు సై అంటోంది. స‌మంత ముఖ్యంగా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతోంది.

Samantha : ఆ హీరో వల్లే సమంతకు హాలీవుడ్‌ సినిమా ఆఫర్‌..?

అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ చిత్రంలో స‌మంత ద్విలింగ సంపర్కురాలి (బైసెక్సువల్) పాత్రలో నటిస్తోందని ఇందులో డిటెక్టివ్ షేడ్ కూడా ఉంటుందని కూడా కథనాలొస్తున్నాయి. ద్విలింగ మహిళ అంటే సమాజంలో వారిని గుర్తించడం అంత సులువు కాదు. ఇతర మహిళల పట్ల ఆకర్షితులుగా ఉంటూ.. వారి అందాన్ని పదే పదే ప్రశంసించే మహిళలను ద్విలింగ మహిళగా గుర్తించాలి. ఈ పాత్ర‌లో స‌మంత న‌టించ‌నుండ‌డం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

స‌మంత‌కు ఈ పాత్ర రావ‌డం వెనుక ద‌గ్గుబాటి హీరో రానా ఉన్నాడ‌ట‌. స‌మంత‌ను, ఓ బేబీ ఫేం సునీత తాటిని క‌లిపింది రానా అనే అంటున్నారు. సునీత తాటిని కలిసి కథ విన్నవెంటనే సామ్ ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఏమాత్రం సంశయించలేదట‌. వెంటనే ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం  వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స‌మంత‌ తెలుగులో శ్రీదేవి మూవీస్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కి సంతకం చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment