Samantha : స‌మంత ప‌రువు న‌ష్టం కేసులో తుది తీర్పు.. ఆ విధంగా చేయాల‌ని కోర్టు ఆదేశం..

October 26, 2021 6:21 PM

Samantha : త‌న ప‌రువు, ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించారంటూ స్టార్ హీరోయిన్ స‌మంత కోర్టులో కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ పై ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసులో ప‌లుసార్లు విచార‌ణ అనంత‌రం ఎట్ట‌కేల‌కు న్యాయ‌మూర్తి తీర్పు చెప్పారు. ఈ తీర్పు స‌మంతకు ఊర‌ట క‌లిగించేదే. అయిన‌ప్ప‌టికీ ఆమె కూడా కోర్టు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

Samantha defamation case final judgement given

కాగా స‌మంత‌పై ప్ర‌సారం చేసిన వీడియోల తాలూకు యూట్యూబ్ లింక్‌ల‌ను వెంట‌నే డిలీట్ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. అలాగే ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి చెందిన ఎలాంటి వీడియోల‌ను ప్ర‌సారం చేయ‌రాద‌ని, కామెంట్స్ చేయ‌రాద‌ని.. ఇంజెక్ష‌న్ ఆర్డ‌ర్‌ను పాస్ చేసింది. ఇక‌పై ఎవ‌రూ కూడా స‌మంత వ్య‌క్తిగ‌త‌, కుటుంబ విష‌యాల జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని న్యాయ‌మూర్తి తీర్పు చెప్పారు.

అయితే స‌మంత త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌రాదంటూ కోర్టు ఆమెకు సూచించింది. స‌మంత త‌ర‌ఫున హైకోర్టు న్యాయ‌వాది బాలాజీ వాద‌న‌లు వినిపించారు.

కాగా నాగ‌చైత‌న్య‌తో విడాకులు అని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. కొన్ని చాన‌ల్స్ అయితే లేని పోని ఆరోప‌ణ‌లు చేశారు. త‌ప్పంతా ఆమెదేన‌న్న‌ట్లు చూపించారు. దీంతో మ‌న‌స్థాపం చెందిన స‌మంత కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేసింది. ఈ క్ర‌మంలోనే న్యాయ‌మూర్తి ప‌లు సార్లు కేసు విచార‌ణ‌ను వాయిదా వేసి ఎట్ట‌కేల‌కు తీర్పు చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment