Samantha : నీ కోసం వస్తున్నా.. వైరల్‌ అవుతున్న సమంత లేటెస్ట్‌ పోస్ట్‌..!

Samantha : సోషల్‌ మీడియాలో సమంత ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తాను చేసే పనులు, పాల్గొనే కార్యక్రమాలకు చెందిన ఫొటోలను ఆమె షేర్‌ చేస్తుంటుంది. అయితే ఇటీవలి కాలంలో నాగచైతన్య లేకుండా ఆమె ఒంటరిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం చర్చనీయాంశంగా మారింది.

Samantha

నాగచైతన్య, సమంత ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని, సమంత ప్రవర్తన అక్కినేని ఫ్యామిలీకి నచ్చడం లేదని.. అందుకనే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని.. ఈ మధ్య వార్తలు బాగా వస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా సమంత ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్తోంది.

Samantha

ఇక నాగచైతన్య తాజా మూవీ లవ్‌స్టోరీకి సంబంధించి సమంత ఎలాంటి కామెంట్లు చేయలేదు. సాధారణంగా చైతూకు చెందిన ఏ మూవీ లాంచ్‌ అయినా, రిలీజ్‌ అయినా ఆమె సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంది. కానీ ఇప్పుడలా పెట్టలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న విషయానికి మరింత బలం చేకూరినట్లయింది.

Samantha

అయితే సమంత తాజాగా హైదరాబాద్‌కు చెందిన కొందరు సైక్లిస్టులతో రైడ్‌కు వెళ్లింది. 21 కిలోమీటర్లు ప్రయాణించానని, 100 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కేందుకు ముందుకు సాగుతున్నానని, త్వరలో ఆ దూరం కూడా పూర్తి చేస్తానని సమంత చెప్పింది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

ఇక తాజాగా ఆమె కీర్తిసురేష్‌, త్రిషలతో పార్టీకి అటెండ్‌ అయింది. ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అలాగే లవ్‌స్టోరీ విడుదల సందర్భంగా హైదరాబాద్‌కు అమీర్‌ఖాన్‌ రాగా నాగచైతన్య, నాగార్జున ఆయనతో చిన్న పార్టీ చేసుకున్నారు. అందులోనూ సమంత కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్‌ మరింత ఆందోళన చెందుతున్నారు. చైతూతో విడాకుల సంగతేమిటి ? స్పష్టత ఇవ్వు.. అని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం ఎప్పటికి తేలుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM