iQOO Z5 5G : మొబైల్స్ తయారీ సంస్థ ఐక్యూ కొత్తగా ఐక్యూ జడ్5 పేరిట ఓ 5జి స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778జి ప్రాసెసర్‌ను అమర్చారు. దీని వల్ల 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే 8, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. అదనంగా మరో 4జీబీ వర్చువల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. 128, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో లభిస్తున్నాయి.
ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. మెమొరీ కార్డు వేసుకునేందుకు స్లాట్ లేదు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో లభిస్తుంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి.
ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,990 ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,990గా ఉంది. ఈ ఫోన్‌ను అక్టోబర్ 3వ తేదీ నుంచి విక్రయిస్తారు. అమెజాన్‌తోపాటు ఐక్యూ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఐసీఐసీఐ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.1500 తగ్గింపు ధర లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయం, 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలను అందిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…