Saiee Manjrekar : గ‌ని హీరోయిన్ అందాల ఆర‌బోత‌.. త‌ట్టుకోలేక‌పోతున్నారు..!

April 26, 2022 11:13 AM

Saiee Manjrekar : మ‌హేష్ మంజ్రేక‌ర్ ముద్దులు కూతురు సాయి మంజ్రేక‌ర్ గ‌ని సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఏప్రిల్ 22న గ‌ని ఆహాలో రిలీజ్ అయింది. తెలుగు ఓటీటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆహా సినిమా నిర్మాతల కట్‌ వెర్షన్ ను విడుదల చేశారు. ఇందులో మూవీ నిడివి మరో 10 నిమిషాలకు పైగా పెరిగింది. అయితే ఈ సినిమా హీరోయిన్ సాయి మంజ్రేక‌ర్ ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను త‌న‌దైన శైలిలో అల‌రిస్తోంది. ఈమె చేస్తున్న ఫొటోషూట్స్‌కు మ‌తులు పోతున్నాయి.

Saiee Manjrekar latest photos trending
Saiee Manjrekar

కాగా సాయి మంజ్రేకర్‌ లవ్‌లో పడిందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సాజిద్‌ కుమారుడు సుభాన్ నదియావాలాతో ల‌వ్‌లో ఉందంటూ కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇటీవ‌ల‌ దీనిపై స్పందించిన హీరోయిన్‌ అవన్నీ అసత్య ప్రచారాలుగా కొట్టిపారేసింది. తామిద్దరం చిన్ననాటినుంచే బెస్ట్‌ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచే తన మీద పుకార్లు పుట్టించడం కామన్‌ అయిపోయిందన్న సాయి మంజ్రేకర్‌.. తనేంటో తన కుటుంబానికి, స్నేహితులకు తెలుసని చెప్పింది.

సాయి మంజ్రేక‌ర్‌ని తెలుగు, హిందీ భాష‌ల‌కు సంబంధించిన సినిమాల కోసం ప‌రిశీలిస్తున్నారు. ఈ అమ్మ‌డు తాజాగా ఎఫ్‌హెచ్ఎం మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్‌ కోసం ఫోటోషూట్ చేసింది. ఇందులో సాయి మంజ్రేక‌ర్ బోల్డ్ లుక్‌లో క‌నిపించింది. ఇది చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. గ‌తంలో కూడా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ అవ‌తారంలో క‌నిపించి నెటిజ‌న్స్ మైండ్ బ్లాక్ చేసింది. త్వ‌ర‌లో ఈ అమ్మ‌డు మేజ‌ర్ సినిమాతో ప‌ల‌క‌రించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment