Sai Pallavi : మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తోంది. తన నటనతో, తన డ్యాన్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తూ అభిమానుల్ని సంపాదించుకుంటోంది. సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఇప్పుడు తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి.
ఇటీవలే నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో మన ముందుకి వచ్చి విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి చేసిన పాత్రకి మంచి పేరు వస్తోంది. అయితే ఈ సినిమా దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే మలయాళం, తెలుగు, తమిళ్ సినిమాలలో నటిస్తున్న సాయి పల్లవి ఈ సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా సాయి పల్లవి హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌కి వెళ్లింది.
బుర్ఖాలో వెళ్లిన సాయి పల్లవిని ఎవరూ గుర్తు పట్టలేదు. దీంతో ప్రశాంతంగా సినిమా మొత్తం వీక్షించింది. బయటకు వచ్చిన తర్వాత బుర్ఖా ఓపెన్ చేసి తన ఫేస్ చూపించి ఆ తర్వాత కారు ఎక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. త్వరలో సాయి పల్లవి బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…